-దరఖాస్తు చేసుకునేందుకు నేడే చివరి తేది
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో గల రకరకాల సర్వీస్ ప్రొవైడర్లను గుర్తించి వారికి నైపుణ్య సాంకేతిక శిక్షణ గవర్నర్పేటలోని ఐ వి పాలస్ నందు ఉదయమ్మ 10 గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు దరఖాస్తులు స్వీకరించారని విజయవాడ నగర పాలక సంస్థ ప్రాజెక్ట్ ఆఫీసర్ యు సి డి విభాగం అధికారి వెంకటనారాయణ తెలిపారు. ప్లంబర్లు, కార్పెంటర్లు, ఎలక్ట్రిషన్లు, ఏసీ, టీవీ, రిఫ్రిజిరేటర్, వాషింగ్ మిషన్ వంటి మరమ్మతులు చేసేవారు పెయింటర్, బ్యూటీషియన్( స్త్రీలైనా, పురుషులైనా) తదితర తగిన నైపుణ్య సాంకేతిక శిక్షణ సర్టిఫికెట్ ఇవ్వటంతో పాటు జీవనోపాధి కల్పిస్తున్నట్లు వెల్లడించారు.
ఈ సందర్భంగా టిడిపి ఫ్లోర్ లీడర్ నెలిబండ్ల బాలస్వామి మాట్లాడుతూ ప్రజల ఆర్థిక స్థితిని పెంచేందుకు ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు ఎంతో అభినందనీయమని ప్రజలు దీని సద్వినియోగం చేసుకొని వారికి ప్రభుత్వం కల్పించే నైపుణ్య శిక్షణను పొంది ఒకవైపు శిక్షణతో పాటు మరోవైపు జీవనోపాధి కల్పించే విధంగా ప్రభుత్వం చేస్తున్న ఈ కార్యక్రమంలో వాళ్ళు పాల్గొనేందుకు ఒక చక్కటి అవకాశం అని అన్నారు.
శుక్రవారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు 556 అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నరాని, ఆసక్తిగల అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు నేడే చివరి రోజు అని ఉదయం 10 గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు గవర్నర్పేట ఐవీ ప్యాలెస్ ప్రాంగణంలో తమ పేరు వివరాలతో పాటు ఆధార్ కార్డు పాన్ కార్డు డ్రైవింగ్ లైసెన్స్ కాపీలతో పాటు విద్యార్హత అనుభవ దృవీకరణ పత్రాలు పాస్బుక్ రేషన్ కార్డు వివరాలుతో నమోదు చేసుకోవాలని కోరారు. వీరందరికీ జనవరి 15 నుండి 31 వరకు ఉచితంగా ప్రభుత్వం వారిచే నైపుణ్య శిక్షణ ఇవ్వటమే కాకుండా ఉపాధి కల్పించనున్నారు అని తెలిపారు. మరిన్ని వివరాలకు జిఎస్ సుజాత 8790233881 పి మంజుల దేవి 7780683789 సంప్రదించాలని అధికారులు సూచించారు.
శుక్రవారం దరఖాస్తులు స్వీకరించే కార్యక్రమంలో 23 వ డివిజన్ కార్పొరేటర్ మరియు టిడిపి ఫ్లోర్ లీడర్ నీలిబండ్ల బాలస్వామి, విజయవాడ నగరపాలక సంస్థ యుసిడిది భాగమధికారులు ఫణి కుమార్, సుజాత, జగదీశ్వరి తదితరులు పాల్గొన్నారు.