విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కమ్మవారి సేవాసమితి సంక్రాంతి సంబరాలు- 2025 అంగరంగ వైభవంగా జరుగుతాయని నిర్వాహకులు కిలారు ఫణి తెలిపారు. స్థానిక బందర్ రోడ్డులో ఒక ప్రముఖ హోటల్లో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కమ్మవారు సహజంగా అందరూ సంపన్నులు లుగా ఉన్నత స్థితిలో ఉంటారని, అందరూ అనుకుంటారు కానీ కమ్మ కులస్తులలో బడుగు ,బలహీన, పేదవారు, చాలామంది ఉన్నారు అని, వారి పిల్లలకు విద్యాభ్యాసం కొరకు ఒక హాస్టల్ గంగూరు నిర్వహిస్తున్నామని ప్రతి సంవత్సరం 30 మంది విద్యార్థి, విద్యార్థులను విద్యాభ్యాసం నేర్పిస్తున్నామని,
విద్యాభ్యాసం మెరిట్ పద్ధతిలో నేర్పుతున్నామని, ఆయన అన్నారు .ఈ సేవాసమితి 2016లో స్థాపించామని, ప్రతి విద్యార్థి విద్యార్థులు 6 తరగతినుండి పదవ తరగతి వరకు విద్యను మెరిట్ పద్ధతిలో నేర్పుతున్నామని, తెలిపారు. అంతే కాకుండా ఇంటర్మీడియట్ ,డిగ్రీ చదువులు దోహదపడేలా మెరిట్ స్కిల్స్ తో విద్యను నేర్పుతున్నామని ఆయన అన్నారు. ఈ సంక్రాంతి సంబరాలు. జనవరి 5వ తేదీ ఆదివారం ఉదయం 9 గంటల నుండి ప్రారంభమవుతాయని, వేదిక దనేకుల ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ క్యాంపస్, గంగూరు, విజయవాడ నందు జరుగుతాయని, ఈ కార్యక్రమానికి పద్మ విభూషణ్ ముప్పవరపు వెంకయ్య నాయుడు భారత మాజీ ఉపరాష్ట్రపతి విశిష్ట అతిథిగా తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయ శాఖ మాత్యులు (తెలంగాణ )విచ్చేస్తున్నారని. ఈ కార్యక్రమానికి పద్మ విభూషణ్ చెరుకూరి రామోజీరావు ప్రాంగణం నందు జరుగుతాయని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమానికి సహకరించుటకు సేవా తత్పరత గల దాతలు ఉత్సాహవంతులు ప్రతిభావంతులు అనుభవిజ్ఞులను ఆహ్వానిస్తున్నామని ,విశిష్ట వ్యక్తులకు గౌరవ సత్కారం జరుగుతాయని ఆయన తెలిపారు. తదనానంతరం నిర్వాహకులు వి. అనురాధ మాట్లాడుతూ సంస్కృతి సంప్రదాయాలకు అనుగుణంగా ఈ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరుగుతున్నామని ముఖ్యంగా మహిళలకు మరియు పిల్లలకు తంబోలా ఆటలు పోటీలు వివిధ వినోదకరమైన కార్యక్రమాలు నిర్వహించి పోటీలో విజేతలకు బహుమతులు అందజేయగలమని ఆమె తెలిపారు.
ఈ సంక్రాంతి సంబరాల్లో ప్రత్యేక ఆకర్షణలు పందిపు యడ్లు పొట్టేళ్లు కోడిపుంజులు, పక్షులు, మరియు వివిధ జంతువుల ప్రదర్శన వీరనాట్యం గరగలు డప్పు, దరువులు ,హరిదాసు, మరియు గంగిరెద్దుల ప్రదర్శన మన సంస్కృతి సాంప్రదాయాలకు ఉట్టిపడేలా నిర్వహిస్తున్నామని ఆమె తెలిపారు. తదనంతరం ముత్తవరపు శివరామకృష్ణ, వేములపల్లి అనూరాధ మాట్లాడుతూ మేము ఈ సేవా సమితి పెట్టిన తర్వాత రాష్ట్రంలో ఇతర కులాలు వారు సమితులు ఏర్పాటు చేసి నిర్వహిస్తున్నారని వారు తెలిపారు. ఇతర కులాలు చేస్తున్నందుకు మేము చాలా సంతోస్తున్నామని మాకు చాలా ఆనందంగా ఉందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
దాడి పూర్ణిమను ఆశీర్వదించిన ఎమ్మెల్యే సుజనా చౌదరి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్ దాడి అప్పారావు మనవరాలు, తెలుగు యువత నాయకులు …