-మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసి విద్యార్థులకు మెరుగైన బోధన పద్ధతులు
-బాలుర, బాలికల జూనియర్ కళాశాలల్లో ప్రారం భించిన డొక్కా సీత మ్మ మధ్యాహ్న భోజన పథ కం.
-శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు.
-విద్యార్థులతో కలిసి భోజనం చేసిన శాసన సభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు
కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త :
కార్పొరేట్ విద్యాసంస్థలతో ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలను తయారు చేస్తున్నామని కొవ్వూరు శాసనసభ్యులు ముప్పిడి వెంకటే శ్వరరావు అన్నారు. శనివారం స్థానిక ప్రభుత్వ బాలికల, బాలుర జూనియర్ కళాశాలలో డొక్కా సీతమ్మ మధ్యాహ్నం భోజనం పథకాన్ని ఆయన ప్రారంభించారు. తొలుత డొక్కా సీతమ్మ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వర రావు మాట్లాడుతూ పేద విద్యార్థినీ విద్యార్థులకు ఉచితంగా మధ్యాహ్న భోజన పథకం ప్రవేశ పెట్టడం వల్ల వారి కుటుంబాలపై ఆర్ధిక భారం పడకుండా చూడడం జరుగు తుందన్నారు. ఎమ్మెల్యే వెంకటేశ్వర రావు విద్యార్థు లకు భోజనం వడ్డించి , అనంతరం విద్యార్థులతో భోజనం చేశారు. నిరుపేదల కడుపు ను నింపిన డొక్క సీతమ్మ వారి పేరు పాఠశాలల్లో , జూనియర్ కళా శాలల్లో మధ్యాహ్న భోజన పథకానికి డొక్క సీతమ్మ భోజనం పథకంగా ప్రారంభించడం ఎంతో సంతోషకరంగా ఉందని తెలియ జేశారు. విద్యార్థులకు మధ్యా హ్న భోజనం పథకం ద్వారా ఆర్థికంగా వారి కుటుంబాలకు ఎంతో లబ్ధి చేకూరు తుందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తిరిగి జూనియర్ కాలేజీ విద్యార్థుల కోసం మధ్యాహ్న భోజన పథకాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తిరిగి ప్రారంభించడం జరిగిందన్నారు. ఇందుకు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తరఫున ముఖ్యమంత్రి నారా చంద్రబా బు నాయుడు, ఉప ముఖ్య మంత్రి పవన్ కళ్యాణ్, మానవ వనరులు శాఖ మంత్రి నారా లోకేష్ లకు ధన్య వాదాలు తెలియజేస్తున్నామన్నారు.
కార్యక్రమంలో జూనియర్ కాలే జ్ ప్రిన్సిపల్స్ గారపాటి సతీష్ కుమార్, లెక్చరర్లు ఎస్.సత్యనారాయణ కంఠమణి రామకృష్ణ, మాజీ మున్సి పల్ చైర్మన్ సూరపనేని చిన్ని, సూర్యదేవర రంజిత్, కూటమి నాయకులు
తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News