-20-01-2025 నుండి 02-02-2025 వరకు ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు
-1310 బృందాలతో 6,41,680 గృహాల సందర్శన
-జెసి చిన్న రాముడు
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
తూర్పుగోదావరి జిల్లాలో జాతీయ కుష్టు వ్యాధి నిర్మూలన కార్యక్రమం కింద లెప్రసీ వ్యాధికి గురైన వారిని గుర్తించడంలో ప్రచారం (LCDC) ద్వారా ప్రజల్లోకి వెళ్ళాలని, విస్తృత స్థాయిలో చైతన్యం తీసుకుని రావాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్ పి జి ఆర్ ఎస్ సమావేశ మందిరంలో జాతీయ లెప్రసీ నిర్మూలన కార్యక్రమం లెప్రసీ కేస్ డిటెక్షన్ క్యాంపెయినింగ్ ప్రచార కరపత్రాలు ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు మాట్లాడుతూ , లెప్రసి వ్యాధి ఉన్నవారిని ముందస్తుగా గుర్తించడం, కమ్యూనిటీ లో వ్యాప్తి చెందకుండా నివారణ చర్యలు సమర్ధవంతంగా చేపట్టడం జాతీయ లెప్రసీ నిర్మూలన కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశ్యం అన్నారు. ఇందు కోసం 20-01-2025 నుండి 02-02-202 వరకు ప్రత్యేక ప్రచార కార్యక్రమాలను సమన్వయ శాఖల ఆధ్వర్యంలో చేపట్టనున్నట్లు తెలిపారు. ఇందు కోసం క్షేత్ర స్థాయిలో 1310 బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు . ఒక ఆశా, ఒక పురుష వాలంటీర్ కలిగిన బృందాలతో 6,41,680 గృహాల సందర్శన చేయనున్నట్లు జెసి చిన్న రాముడు పేర్కొన్నారు. కమ్యూనిటీ లేప్రసి వ్యాప్తిని అరికట్టడానికి , వ్యాధి ఉన్నవారిని గుర్తించడం మరియు వాటిని ముందుగానే గుర్తించి తగిన చికిత్స అందించడం ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశ్యం అన్నారు.
జిల్లా లేప్రసి నివారణ అధికారి డా ఎన్ వసుంధర మాట్లాడుతూ, IEC కార్యకలాపాలను సమర్థవంతంగా నిర్వర్తించడానికి పిహెచ్‌సిలు మరియు సచివాలయం స్థాయిలో ఆరోగ్య కార్యకర్తలందరికీ శిక్షణసూక్ష్మ ప్రణాళిక తయారీ చెయ్యడం జరిగిందన్నారు. వైద్యాధికారి మరియు జిల్లా బృందాల పర్యవేక్షణలో జిల్లాలోని ప్రజలందరికీ కుష్టు వ్యాధి సంకేతాలు మరియు లక్షణాలను వివరించడం, విశ్లేషించడం మరియు సమీక్షించడం, బృందాలు, పర్యవేక్షణ చేసి అభిప్రాయ సేకరణ చేయనున్నట్లు తెలిపారు. ఇందుకోసం రెవిన్యూ, పంచాయతీ , మునిసిపల్ , సమాచార శాఖ ఇతర అనుబంధ శాఖల సమన్వయంతో విస్తృత స్థాయిలో చైతన్యం కలిగించే కార్యక్రమాలు చేపట్టడం జరుగుతున్నట్లు వివరించారు.
ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో జాయింట్ కలర్ తో పాటు జిల్లా రెవెన్యూ అధికారి టి సీతారామ మూర్తి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా. కె వెంకటేశ్వరరావు, జిల్లా లేప్రసి నియంత్రణా అధికారి ఎన్ వసుంధర, సిపివో ఎల్ . అప్పలకొండ, జిల్లా గ్రామ పంచాయతీ అధికారి ఎమ్. నాగలత తదితరులు పాల్గొన్నారు.