Breaking News

ఏపీఈఆర్సీ ఆధ్వర్యంలో విద్యుత్ ఛార్జీలపై ప్రజాభిప్రాయ సేకరణ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి ఆధ్వర్యంలో 2025-26 ఆర్థిక సంవత్సరానికి ప్రతిపాదించిన వార్షిక ఆదాయ అవసరాలు మరియు రిటైల్ ధరలపై వ్యక్తిగతంగా మరియు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా బహిరంగ ప్రజాభిప్రాయ సేకరణ మంగళవారం విజయవాడ లోని ఓ ప్రైవేట్ పంక్షన్ హాల్ లో నిర్వహించారు. ప్రజాభిప్రాయ సేకరణ లో భాగంగా ఏపీఈఆర్సీ ఛైర్మన్ ఠాకూర్ రామ్ సింగ్, మెంబర్ పి. వెంకట రామి రెడ్డిలు విద్యుత్ టారీఫ్ తదితర అంశాలపై ప్రజాభిప్రాయ సేకరణ జరిపారు. ఈ సందర్భంగా ఏపీఈఆర్సీ ఛైర్మన్ ఠాకూర్ రామ్ సింగ్ మాట్లాడుతూ 2025-26 ఆర్థిక సంవత్సరానికి ప్రతిపాదించిన వార్షిక ఆదాయ అవసరాలు పై ప్రజలు, ప్రజా సంఘాలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేయాలని కోరారు. అలాగే అభ్యంతరాలను, విజ్ఞాపనలను, సూచనలు, సలహాలు ఇవ్వాలని కోరారు. ప్రతి అభ్యర్థన, విజ్ఞపనలను పరిగణలోకి తీసుకుంటామని, అలాగే ప్రజామోదమైన నిర్ణయాలు తీసుకుంటామని తెలిపారు. అనంతరం ఏపీసీపీడీసీఎల్, ఏపీఎస్పీడీసీఎల్, ఏపీఈపీడీసీఎల్ అధికారులు తమ వార్షిక నివేదికలను చదివి వినిపించారు. అంతేకాకుండ పూర్తి వివరాలతో స్లైడ్స్ రూపంలో ప్రదర్శించారు. అనంతరం పలువరు తమ అభిప్రాయాలను, విజ్ఞాపనలను, అభ్యంతరాలను ఛైర్మన్ దృష్టికి తీసుకువచ్చారు.
సీపీఎం రాష్ట్ర నాయకులు బాబూరావు తన అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీల్లో భాగంగా విద్యుత్ ఛార్జీలను పెంచబోమని, టారీఫ్ లను తగ్గిస్తామని, ట్రూఅఫ్ చార్జీలు తీసివేస్తామన్నారన్నారు. కాని ఇప్పటికీ సర్థుబాటు చార్జీలు, ట్రూఅఫ్ చార్జీలు ఇంకా వడ్డిస్తునే ఉన్నారన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి విద్యుత్ ఛార్జీల తగ్గింపుపై దృష్టి సారించాలని కోరారు. గత ప్రభుత్వం పేద ప్రజల నడ్డి విరిచిందని, కూటమి ప్రభుత్వం ప్రజలకు మేలు చేకూర్చే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రీపెయిడ్ మీటర్ల బిగింపు ఆలోచన మానుకోవాలని విజ్ఞప్తి చేశారు. సెకీతో తప్పుడు ఒప్పందం చేసిన గత ప్రభుత్వం భావితరాల భవిష్యత్ ను కూడా తాకట్టు పెట్టిందని, సీఎం చంద్రబాబు ఆ ఓప్పందాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సోలార్ విద్యుత్ కొనుగోలులో అవకతవకలు జరిగాయన్నారు. అదానితో ఓప్పందం రద్దు చేసుకోకపోతే ఉద్యమిస్తామని హెచ్చరించారు.
రిటైర్ట్ విద్యుత్ సంస్థ ఉన్నతాధికారి పున్నారావు తన అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ విద్యుత్ పంపిణీ సంస్థలను బలోపేతం చేయాలని సూచించారు. జనసేన నాయకులు అక్కల గాంధీ మాట్లాడుతూ విటీపీఎస్ ఏర్పాటుకు కొండపల్లి, సమీప 20 గ్రామాల ప్రజలు స్వచ్ఛందంగా తమ భూములను ఇచ్చారని, కాని నేడు ఈ ప్లాంట్ నుంచి వెలువడే కాలుష్యంతో ఈ 20 గ్రామాల ప్రజలు వలస బాట పట్టే పరిస్థితులు నెలకొన్నాయని, కావున విద్యుత్ అధికారులు ప్లాంట్ నుంచి వెలువడే కాలుష్య నివారణకు చర్యలు తీసుకోవాలని కోరారు. ఎంసీహెచ్ఎస్ వేణుగోపాల రెడ్డి మాట్లాడుతూ విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని డిమాండ్ చేశారు.
కార్యక్రమంలో విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు, మూడు పంపిణీ సంస్థల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

డిల్లీలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి పర్యటన

-రవాణా వ్యవస్థపై క్షేత్ర స్థాయిలో సమీక్షా -రోడ్డు భద్రతా విధి విధానాలపై మంత్రి పరిశీలన -తెలంగాణ రవాణా శాఖ మంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *