Breaking News

విద్యుత్ ఛార్జీల భారాన్ని తగ్గించండి

-ప్రజాభిప్రాయ సేకరణలో అభ్యంతరాలు వ్యక్తం చేసిన మల్లాది విష్ణు, దేవినేని అవినాష్
-ఏపీఈఆర్సీ రెగ్యులేటరీ కమీషన్ ఛైర్మన్ కు వినతిపత్రం అందజేత

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్రజలపై ఇంధన సర్దుబాటు ఛార్జీల పేరుతో ప్రభుత్వం మోపుతున్న భారాలను వెంటనే ఉపసంహరించాలని వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు కోరారు. విద్యుత్ టారిఫ్ ల అంశంపై ఏపీ విద్యుత్ నియంత్రణ మండలి ప్రజాభిప్రాయ సేకరణలో భాగంగా మంగళవారం ఏ1 కన్వెన్షన్ సెంటర్ నందు వైసీపీ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్ తో కలిసి ఏపీఈఆర్సీ రెగ్యులేటరీ కమిషన్ ఛైర్మన్ కు ఆయన వినతిపత్రం అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. 2025-26లో భారాలు లేవంటూనే సర్దుబాటు ఛార్జీల ద్వారా రూ. 15,485.36 కోట్ల భారం ముందుగానే మోపారని మల్లాది విష్ణు ఆరోపించారు. ఏ.ఆర్.ఆర్. ప్రతిపాదనలకు సంబంధం లేకుండా వినియోగదారులపై వివిధ రూపాల్లో భారం మోపుతున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో దాదాపు 50 లక్షల పేద కుటుంబాలతో సహా 2 కోట్ల మంది విద్యుత్ వినియోగదారులపై అధిక భారం పడుతోందన్నారు. రెండు కోట్ల మంది వినియోగదారులలోనూ గృహ వినియోగదారులే దాదాపు 1.5 కోట్ల మంది ఉన్నట్లు వెల్లడించారు. గత తెలుగుదేశం ప్రభుత్వం 2014-19 మధ్య ఐదేళ్ల కాలంలో డిస్కంలకు రూ. 15 వేల కోట్లు మాత్రమే సబ్సిడీ ఇవ్వగా.. తర్వాత వచ్చిన వైఎస్ జగన్ ప్రభుత్వం రూ. 45 వేల కోట్లకు పైగా విద్యుత్ రంగానికి అందజేసి ఆదుకుందని ఈ సందర్భంగా గుర్తుచేశారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం సబ్సిడీలు భరించేందుకు నిరాకరిస్తూ.. వినియోగదారులపై నిర్దాక్షిణ్యంగా రూ. 15,485.36 కోట్లకుపైగా ఛార్జీల భారాన్ని మోపుతోందని ఆరోపించారు. ఫలితంగా అద్దె గృహాలలో చాలీచాలని జీతాలతో కుటుంబాలు నడిపే వారికి ఈ విద్యుత్ ఛార్జీలు పెనుభారంగా మారాయన్నారు. సెంట్రల్ నియోజకవర్గానికి సంబంధించి మొత్తం 1,50,295 విద్యుత్ కనెక్షన్లకు గానూ ప్రతినెలా 30.73 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం జరుగుతోందని మల్లాది విష్ణు తెలిపారు. అదనపు వడ్డింపులతో కలిపి నియోజకవర్గ ప్రజలపై రూ. 150 కోట్ల భారం పడుతున్నట్లు వెల్లడించారు. కనుక కరెంట్ ఛార్జీలు పెంచమని, అవసరమైతే తగ్గిస్తామని పైగా వినియోగదారులే విద్యుత్ అమ్ముకునేలా చేస్తానని ఎన్నికల ముందు ఇచ్చిన హామీను కూటమి ప్రభుత్వం నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఇంధన సర్దుబాటు ఛార్జీల భారాన్ని వినియోగదారుల మీద మోపకుండా రాష్ట్ర ప్రభుత్వం, డిస్కంలే భరించాలని కోరారు. అలాగే ఎస్సీ, ఎస్టీలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ను సైతం పునరుద్ధరించాలని పేర్కొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

డిల్లీలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి పర్యటన

-రవాణా వ్యవస్థపై క్షేత్ర స్థాయిలో సమీక్షా -రోడ్డు భద్రతా విధి విధానాలపై మంత్రి పరిశీలన -తెలంగాణ రవాణా శాఖ మంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *