-ఎమ్ ఈ వో లు నిరంతర పర్యవేక్షణా బాధ్యత వహించాలి
-రానున్న వార్షిక 10 వ తరగతి లో ఉత్తీర్ణత శాతం గణనీయంగా ప్రగతి చూపాలి
-సీ, డి గ్రేడ్ విద్యార్థులను ఉపాధ్యాయులు తరగతి వారీగా అడాప్ట్ చేసుకొని ఉత్తమ ఫలితాలు సాధించాలి
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
రానున్న వార్షిక పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించడం లో ప్రధానోపాధ్యాయులు కీలక పాత్ర వహించాల్సి ఉంటుందని కలెక్టరు పి ప్రశాంతి ఒక సందేశం ఇవ్వడం జరిగిందనీ జిల్లా పాఠశాల విద్యాధికారి కె వాసుదేవరావు తెలియ చేశారు. నిరంతర అభ్యాస్య ద్వారా మాత్రమే మెరుగైన ఫలితాలు సాధించడం సాధ్యం అన్నారు.
మంగళవారం స్థానిక పిడింగొయ్యి ఫ్యూచర్ కిడ్స్ స్కూల్ ఆవరణలో జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు తో వార్షిక పరీక్షల నిర్వహణా పై ఒకరోజు శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికీ ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా పాఠశాల విద్యాధికారి కె వాసుదేవరావు మాట్లాడుతూ, జిల్లాలోని అన్ని ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు మరియు సబ్జెక్టు ఉపాధ్యాయులు రివిజన్ టెస్ట్స్ నందు మీ సహాయ సహకారములతో ఈ కార్యక్రమమును విజయవంతం చేసి, తద్వారా జిల్లా యొక్క ఉత్తీర్ణతా శాతం పెరుగుదలకు కృషి చేయవలెనని ఆశిస్తున్నట్లుపేర్కొన్నారు. 10 వ తరగతి తో పాటుగా మిగిలిన తరగతుల వార్షిక పరీక్షల నిర్వహణా, విద్యార్థుల్లో పఠనాసక్తి పెంచడానికి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. పునాది గట్టిగా ఉంటేనే ఎన్ని అంతస్తుల భవన నిర్మాణాన్ని చేపట్టడం సాధ్యం అవుతుందని తెలిపారు. అదే విధంగా ప్రాధమిక, మాధ్యమిక, ఉన్నత పాఠశాల లో బోధన పద్ధతులు భవిష్యత్తుకు పునాది అన్నారు. ఇప్పటికే ఇందుకు సంబంధించి శిక్షణ ప్రణాళిక, సామాగ్రి ఇవ్వడం జరిగిందనీ , ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్య సంచాలకులు తదుపరి ఉత్తర్వుల మేరకు పై కార్యక్రమమునందు తగు మార్పులు చేయనున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమం విజయవంతం చేయడంలో ఉప విద్యాశాఖాధికారులు పాత్ర కీలకం అని డి వి ఈ వో వాసుదేవరావు పేర్కొన్నారు. వారి, వారి డివిజన్ల యందు ప్రత్యక్షముగా టెలి కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష పాఠశాలలను భోధన తీరును పర్యవేక్షించాలన్నారు. ఇద్దరు మండల విద్యాశాఖాధికారి మరియు ప్రధానోపాధ్యాయులు మండలంలోని అన్ని ఉన్నత పాఠశాలలలో తప్పనిసరిగా జరుగునట్లు తగు పర్యవేక్షణ చేయలన్నారు.
ఈ విద్యా సంవత్సరం లో రెగ్యులర్ గా, ప్రవేటు గా 25,723 మంది విద్యార్థులు పదోవ తరగతి పరీక్షలకు హాజరు కానున్నట్లు వాసుదేవ రావు తెలిపారు. గత ఏడాది 29,990 మంది విద్యార్థులు హజరు కాగా 83.20 శాతం ఉత్తీర్ణత సాధించగా, సప్లిమెంటరీ పరీక్షల్లో 77.57 శాతం ఉత్తీర్ణత సాధించారన్నారు. ఓపెన్ స్కూల్ పరీక్షల్లో అది 92.24 శాతంగా, 97.28 శాతంగా ఉందని తెలియ చేశారు. 2024-25 లో నూటికి నూరుశాతం సాధించాల్సి ఉంటుందనీ పేర్కొన్నారు
పదో తరగతి విద్యార్థుల కొరకు విషయమును సమ భాగములుగా విభజించి పునఃశ్చరణ తరగతులు నిర్వహిస్తూ వార్షిక పరీక్షల తరహాలో రోజు ఏ, బి గ్రేడుల వారికి 25 మార్కులకు, సి , డి గ్రేడుల వారికి 20 మార్కులకు నిర్వహించి వారి పఠనాసక్తి పెంచడానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.
సమాధాన పత్రములను, తదుపరి ఉపాధ్యాయులే తప్పనిసరిగా మూల్యాంకనం చేసి విద్యార్థుల స్థాయిని బట్టి వారికి తగు సూచనలు, సహకారం అందించి. పేపర్లలోని తప్పులు సరిచేసి, రివిజన్ చేయించవలసి ఉంటుందన్నారు.. ఇందుకు సంబంధించి మెటీరియల్ మీకు అందిస్తున్నామని పేర్కొన్నారు.
ఇందుకు సంబంధించి పీరియడ్ నిర్వహణా, విద్యార్థుల ప్రతిభ , అదనపు తరగతులు, 10 వ తరగతి విద్యార్థుల కోసం ఆదివారం ప్రత్యెక తరగతులు తదితర అంశాలపై మాస్టర్ ట్రైనర్ లు శిక్షణా అందించి, సందేహాలను నివృత్తి చెయ్యడం జరిగింది.
ఈ కార్యక్రమంలో డిప్యూటి డి ఈ వో లు, ఎమ్ వి ఈ వో లు, ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.