రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
తూర్పు గోదావరి జిల్లాలో మూడు రోజుల అధికార పర్యటనలో భాగంగా విచ్చేసిన పాండిచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కె. కైలాష్ నాథన్ కు జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, ఎస్పి డీ నరసింహ కిషోర్ లు స్వాగతం పలికారు. మంగళవారం సాయంత్రం హైదరాబాద్ నుంచి రాజమండ్రి విమానాశ్రయానికి చేరుకున్నారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి కొవ్వూరు చేరుకుని రాత్రి బస చెయ్యడం జరుగుతుందని అధికార యంత్రాంగం తెలియ చేశారు. జిల్లాకి చేరుకున్న పాండిచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కె. కైలాష్ నాథన్ కు జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, ఎస్పి డీ నరసింహ కిషోర్, ఎయిర్ పోర్టు డైరెక్టర్ జ్ఞానేశ్వర్, ఆర్డీవోలు ఆర్ కృష్ణ నాయక్ సాదర స్వాగతం పలకడం జరిగింది. పాండిచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కె. కైలాష్ నాథన్ కొవ్వూరు లో రాత్రి బస చేసిన అనంతరం బుధవారం జనవరి 8 వ తేది ఉదయం యానంకు బయలుదేరి వెళ్ళడం జరుగుతుంది. 21వ యానం పీపుల్ కల్చర్ ఫెస్టివల్ 2025 వేడుకల్లో మరియు 23వ యానం ఫ్లవర్ షో 2025 ప్రదర్శన లో పాల్గొనీ, రాత్రి బస చేస్తారు. గురువారం 9 వ తేదీ యానం నుంచి బయలుదేరి ఉదయం 9.45 కి మధురపూడి విమానాశ్రయానికి చేరుకుని, అక్కడి నుంచి ఉదయం 10.15 కు బయలుదేరి హైదరాబాద్ వెళ్లడం జరుగుతుంది. 9 వ తేదీ ఉదయం యానం నుంచి బయలుదేరి రాజమండ్రి విమానాశ్రయానికి ఉదయం 9.45 కు చేరుకుని హైదరాబాద్ వెళ్లడం జరుగుతుందని పేర్కొన్నారు. పాండిచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ విమానాశ్రయం లో స్వాగతం పలికిన వారిలో ఆర్డీవో లు ఆర్ కృష్ణ నాయక్ , ఎయిర్ పోర్టు డైరెక్టర్ జ్ఞానేశ్వర్ రావు, తహసిల్దార్ వి సుస్వాగతం, తదితరులు పాల్గొన్నారు.
Tags rajamandri
Check Also
డిల్లీలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి పర్యటన
-రవాణా వ్యవస్థపై క్షేత్ర స్థాయిలో సమీక్షా -రోడ్డు భద్రతా విధి విధానాలపై మంత్రి పరిశీలన -తెలంగాణ రవాణా శాఖ మంత్రి …