-ఆన్లైన్ చెల్లింపుల కోసం ఏర్పాటు చేసిన క్యూఆర్ కోడ్ పేమెంట్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగర ప్రజలు సకాలంలో సులభంగా పన్ను చెల్లించుటకు విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో గల ఉన్న క్యాష్ కౌంటర్ అన్నిటిలోనూ గూగుల్ పే, ఫోన్ పే ద్వారా పన్ను కట్టేందుకు క్యూఆర్ కోడ్ను అందుబాటులోకి తీసుకొచ్చారు అని చెప్పారు విజయవాడ నగరపాలక సంస్థ ఇంచార్జ్ కమిషనర్ డాక్టర్ డి చంద్రశేఖర్. విజయవాడ నగర పరిధిలో గల క్యాష్ కౌంటర్ అన్నిటిలోనూ ప్రజలు క్యూ లైన్ లో నుంచొని క్యాష్ కౌంటర్ వద్ద నగదు చెల్లించడమే కాకుండా క్యూఆర్ కోడ్ ద్వారా పన్ను చెల్లించవచ్చని తెలిపారు. విజయవాడ నగరపాలక సంస్థ వారికి చెల్లించాల్సిన ఆస్తి, ఖాళీ స్థలం, వివిధ రకాల పన్ను చెల్లింపులు సకాలంలో చేసి విజయవాడ నగరపాలక సంస్థకు సహకరించాలని కమిషనర్ కోరారు.