-తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి గన్నే వెంకట నారాయణ ప్రసాద్ (అన్న)
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
భారతదేశ రక్షణ రంగాన్ని అగ్రపథంలో నిలిపి, దేశ ఖ్యాతిని విశ్వవ్యాప్తం గా ఇనుమడింప చేసిన గొప్ప శాస్త్రజ్ఞుడు, మాజీ రాష్ట్రపతి, భారతరత్న ఏపిజే అబ్దుల్ కలాం అని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి గన్నే వెంకట నారాయణ ప్రసాద్ (అన్న) కోనియాడారు. మంగళవారం ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతి సందర్భంగా విజయవాడ ఏలూరు రోడ్డు ఎస్.ఆర్.ఆర్ కాలేజీ సెంటర్ లో గల అబ్దుల్ కలాం విగ్రహానికి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి గన్నే వెంకట నారాయణ ప్రసాద్ (అన్న) పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత దేశ రక్షణ రంగాన్ని అగ్రపథంలో నిలిపిన మహోన్నత వ్యక్తి, రాష్ట్రపతి పదవికి వన్నె తెచ్చిన మహానీయుడని, అబ్దుల్ కలాంని ఈ నాటి రాజకీయ నాయకులు అందరూ ఆదర్శంగా తీసుకోవాలని, ముఖ్యంగా యువత ఆయన ఆశయాలకు అనుగుణంగా ఆయన బాటలో నడుచుకోవాలని కోరారు. జీవితంలో పైకి ఎదగాలంటే పేదరికం అడ్డుకాదని నిరూపించారని, పేపర్ బాయ్ నుండి భారత రాష్ట్రపతి స్థాయికి చేరటం మనం మర్చిపోలేమన్నారు. ఆయన చేసిన పదవుల వలన ఆ పదవులకు వన్నె వచ్చిందని అన్నారు. ఆయన ఏ రంగంలో పనిచేసినా ఆ రంగానికి ఎనలేని సేవలందించారు అని అన్నారు. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలామ్ భౌతికంగా మన మధ్యన లేకపోయినా మన అందరి గుండెల్లో నిలిచిపోతారని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు.