అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే కార్యాలయంలో మంగళవారం ఏపీజే అబ్దుల్ కలామ్ వర్దంతి కార్యక్రమం ఎమ్మెల్యే ఆర్కే పాల్గొని పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆర్కే మాట్లాడుతూ అబ్దుల్ కలామ్ ఆశయాలకు అనుగుణంగా మనమందరం ఆయన బాటలో నడవాలని అన్నారు. జీవితంలో పైకి ఎదగాలంటే పేదరికం అడ్డుకాదాని నిరూపించారని, పేపర్ బాయ్ నుండి భారత రాష్ట్రపతి స్థాయికి చేరటం మనం మర్చిపోలేమన్నారు. ఆయన చేసిన పదవుల వలన ఆ పదవులకు వన్నె వచ్చిందని అన్నారు. ఆయన ఏ రంగంలో పనిచేసినా ఆ రంగానికి ఎనలేని సేవలందించారు అని అన్నారు. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలామ్ భౌతికంగా మన మధ్యన లేకపోయినా మన అందరి గుండెల్లో నిలిచిపోతారని అన్నారు. ఈ కార్యక్రమంలో వై ఎస్ ఆర్ సి పి నాయకులు, కార్యకర్తలు, స్థానికులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
Tags AMARAVARTHI
Check Also
డిసెంబరు 30 న రాజానగరం ఎంపీడీవో కార్యాలయంలో జాబ్ మేళా
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ మరియు జిల్లా ఉపాధి సంస్థ ఆధ్వర్యంలో తూర్పుగోదావరి …