Breaking News

కృష్ణాజిల్లాలో ఇంతవరకూ 43 శాతం ఖరీఫ్ వరినాట్లు…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రైతుబాగుంటేనే జిల్లా సుభిక్షంగా ఉంటుందని రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్. జగన్మోహన రెడ్డి అన్నారు. రైతుసమస్యల సత్వర పరిష్కారంలో ఎంతమాత్రం తాత్సారం లేకుండా చూడాలన్నారు. మంగళవారం జిల్లా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, యస్ పిలతో తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి స్పందన కార్యక్రమంపై ముఖ్యమంత్రి వై.యస్. జగన్మోహన రెడ్డి వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈవీడియోకాన్ఫరెన్సు సియంఓ నుంచి జిల్లా కలెక్టరు జె. నివాస్ పాల్గొనగా, స్థానిక కలెక్టరు క్యాంపు కార్యాలయం వీడియోకాన్ఫరెన్స్ హాలు నుంచి జాయింట్ కలెక్టరు (రెవెన్యూ, రైతుభరోసా) డా. కె. మాధవిలత, జాయింట్ కలెక్టరు (అభివృద్ధి, సచివాలయాలు) యల్. శివశంకర్ , జాయింట్ కలెక్టరు (ఆసరా, సంక్షేమం) కె. మోహన్ కుమార్ , జాయింట్ కలెక్టరు (హౌసింగ్ ) శ్రీనివాస నుపూర్ అజయ్ కుమార్ , డ్వామా పిడి కె.వి.సూర్యనారాయణ, హౌసింగ్ పిడి రామచంద్రన్, వ్యవసాయశాఖ జాయింట్ డైరెక్టరు టి.మోహనరావు తదితరులు పాల్గొన్నారు.
ఈసందర్భంగా ముఖ్యమంత్రి కోవిడ్ నివారణా చర్యలు, వ్యాక్సినేషన్ వేగవంతంపై దిశానిర్దేశాన్ని చేసారు. అదేవిధంగా రాష్ట్రవ్యాప్తంగా కురిసిన భారీవర్షాలు, వరదలు, సహాయక చర్యలపై ఆయన సమీక్షించారు. అల్పపీడనం కారణంగా ఈ నెల 28, 29వ తేదీలలో కూడా వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ సూచనలకు అనుగుణంగా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. ఖరీఫ్ సన్నద్ధత, విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల అందుబాటుపై సమీక్షిస్తూ కలీ విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు చలామణి అవ్వకుండా గట్టి నియంత్రణా చర్యలు చేపట్టేందుకు పెద్ద ఎత్తులు దాడులు చేయాలన్నారు. రైతులకు ఎంతో మేలుచేసే ఇ-క్రాఫ్ పై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. పంటవేసిన ప్రతీ ఎకరం ఇ-క్రాఫ్లో నమోదు కావాలన్నారు. గ్రామసచివాలయాలు, రైతుభరోసా కేంద్రాలు, గ్రామ,అర్బన్ హెల్త్ క్లినిక్ లు బల్క్ మిల్క్ ఛిల్లింగ్ యూనిట్ల నిర్మాణ ప్రగతి పై ముఖ్యమంత్రి వై.యస్. జగన్మోహన రెడ్డి సమీక్షించారు. ఇళ్ల నిర్మాణం, పట్టాల పంపిణీ పై దిశానిర్దేశం చేయడంతో పాటు గ్రామ, వార్డు సచివాలయాలను తనిఖీలు చేయాలన్నారు. లేనిపక్షంలో క్షేత్రస్థాయి సమస్యలు పూర్తి స్థాయిలో తెలుసుకో లేరన్నారు. వీటిపై నూరుశాతం పర్యవేక్షణ ఉండాలన్నారు. ఆగష్టు మాసంలో సంక్షేమ క్యాలెండరులోని అంశాలను అమలుచేసే కార్యక్రమాల వివరాలను ముఖ్యమంత్రి వివరిస్తూ ఆగష్టు 10వ తేదీన నేతన్న నేస్తం, ఆగష్టు 16న విద్యాకానుక, ఆగష్టు 24వ తేదీన రూ. 20 వేల లోపు డిపాజిట్ చేసిన అగ్రిగోల్డ్ బాధితులకు చెల్లింపులు, ఆగష్టు 27వ తేదీన యంయయంఇ క్రింద ఇన్సెంటివ్స్ విడుదల చేయడం జరుగుతుందన్నారు. ఇదిలాఉండగా కృష్ణాజిల్లాలో 3 లక్షల 21 వేల 680 హెక్టార్లు ఖరీఫ్ సాధారణ విస్తీర్ణం కాగా, ఇంతవరకూ 1,36,978 హెక్టార్లలో అనగా 43 శాతం వరినాట్లు పడ్డాయి.

Check Also

గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల చేసినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు కి, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ కి కృతజ్ఞతలు

-ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట్ర అధ్యక్షులు వై.వి.బి. రాజేంద్రప్రసాద్  అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *