మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని ఆరోగ్య కరమైన గ్రామాలే లక్ష్యంగా అందరూ పనిచేసినప్పుడు రాష్ట్రమంతటా పచ్చదనం వెల్లి విరుస్తుందని రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య ( నాని ) ఆశాభావం వ్యక్తం చేశారు. గురువారం మధ్యాహ్నం స్థానిక మచిలీపట్నం మార్కెట్ యార్డ్ ప్రాంగణంలో జరిగిన “జగనన్న స్వచ్ఛ సంకల్పం” అమలుపై సర్పంచ్ లు , సచివాలయ ఉద్యోగులతో జరిగిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ, ప్రభుత్వం సంకల్పించిన జగనన్న పచ్చతోరణం కార్యక్రమం ద్వారా మొక్కలు నాటాలన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలు పెంచితే పర్యావరణాన్ని కాపాడవచ్చని అన్నారు. ప్రతి 250 కుటుంబాలకు ఒక గ్రీన్ అంబాసిడర్ ( హరిత రాయబారి ) నియమించుకోవాలని, ఇంటి ముందు మొక్కలు పెంచితే చుట్టుపక్కల అంతా ఆరోగ్యకరమైన వాతావరణం నెలకొంటుందని అన్నారు. మొక్కలు పెంచడం అలవాటుగా మార్చుకుంటే మనసుకు కూడా ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుందన్నారు. అందరూ తమ వంతుగా ఇంటి చుట్టూ ఖాళీ ప్రదేశాల్లో మొక్కలు పెంచి పర్యావరణ హితానికి తోడ్పడాలని కోరారు. గత నెల జూలై 8న జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభించారని ..జగనన్న స్వచ్ఛ సంకల్పం కోసం రూ.1312.04 కోట్లు ప్రభుత్వం కేటాయించామని..ఆ నిధులతో ఆరోగ్యకరమైన గ్రామాలను తీర్చి దిద్దుతారని మంత్రి తెలిపారు. ఈ మహత్తర కార్యక్రమంలో సర్పంచ్లంతా గ్రామసచివాలయ వ్యవస్థను ఉపయోగించుకోవాలని సూచించారు. ఆరోగ్యకరమైన గ్రామాలే లక్ష్యం కోసం ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టారనీ.. ‘‘గ్రామ సర్పంచ్లు ఈ కార్యక్రమం ద్వారా వారి పంచాయితీలను స్వచ్ఛ పల్లెలుగా తీర్చి దిద్దాలని పిలుపునిచ్చారు. సర్పంచ్ ల భాగస్వామ్యంతోనే పల్లెలు సరికొత్త పచ్చని పల్లెలుగా మారతాయని..ప్రజలు ఆరోగ్యంగా ఉండేలా చూడాలని తెలిపారు. ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజలకు చేరువ చేసి ప్రజలు లబ్ది పొందేలా సర్పంచ్ లు చూసుకోవాలన్నారు. పట్టణాలకు ఏమాత్రం తీసిపోకుండా పల్లెలను తీర్చిదిద్ది అభివృద్ది బాటలో పయనించేలా ప్రభుత్వం సహకారంతో ఈ పనులు చేయాలని సూచించారు. ప్రతిగ్రామం పరిశుభ్రత, పచ్చదనంతో కళకళలాడాలని ఇది ముఖ్యమంత్రి జగన్ ఆకాంక్ష అనీ..స్వచ్ఛసంకల్ప కార్యక్రమాల్లో ప్రజలంతా భాగస్వాములు అయ్యి వారి పల్లెల పరిశుభత్రలో పాలు పంచుకోవాలని మంత్రి పేర్ని నాని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ సి ఇ ఓ సూర్యప్రకాశరావు, డ్వామా పిడి సూర్యనారాయణ , మచిలీపట్నం తహసీల్దార్ సునీల్ బాబు తదితర అధికారులు పలువురు సర్పంచ్ లు పాల్గొన్నారు.
Tags machilipatnam
Check Also
డిసెంబరు 30 న రాజానగరం ఎంపీడీవో కార్యాలయంలో జాబ్ మేళా
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ మరియు జిల్లా ఉపాధి సంస్థ ఆధ్వర్యంలో తూర్పుగోదావరి …