విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సుమారు 75 లక్షలతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు పశ్చిమ ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ 52 వ డివిజన్ టీడీపీ కార్పొరేటర్ ఉమ్మడి వెంకటేశ్వరరావు (చంటి) ఎన్డీఏ కూటమి నేతలతో కలిసి బుధవారం శంకుస్థాపన చేశారు. మల్లికార్జున పేటలోని సంపర తాతబ్బాయి కళ్యాణ మండపం నుండి పోతిన అప్పన్న వీధి వరకు నూతన తాగునీటి పైపులైన్ల నిర్మాణానికి కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు ఎమ్మెల్యే సుజనా చౌదరికి కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా ప్రగతి న్యూ హెచ్. ఐ. జీ హౌసింగ్ బోర్డ్ కాలనీ లోని ప్రభుత్వ స్థలంలో రూ. 29.50. లక్షలతో చేపట్టనున్న కాంపౌండ్ వాల్ నిర్మాణానికి ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్, ఇంజనీరింగ్ అధికారులతో కలిసి భూమి పూజ చేశారు.నిర్మాణ పనులలో నాణ్యత, ప్రమాణాలు పాటించి పనులను సకాలంలో పూర్తిచేయాలని ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆదేశించారని కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ కాంట్రాక్టర్ కు తెలిపారు. కార్పొరేటర్ ఉమ్మడి వెంకటేశ్వరరావు (చంటి) మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా ఎమ్మెల్యే సుజనా చౌదరి పశ్చిమ అభివృద్ధికి అధిక నిధులు కేటాయిస్తున్నారని తెలిపారు… ఈ కార్యక్రమం లో ఇ.ఇ సురేఖ, డీ.ఇ కరుణాకర్,
ఎ .ఇ రామకృష్ణ, డీ.ఇ పురుషోత్తం, ఎ.ఇ రామకృష్ణ, ఎ.ఇ ఖలీల్ భాష 42 వ డివిజన్ ఊర్మిళ నగర్ బీజేపీ మండల అధ్యక్షుడు పగడాల కృష్ణ ,52 వ డివిజన్ బీజేపీ అధ్యక్షుడుదొడ్ల రాజా ఎన్డీఏ కూటమి నేతలు గోలి శ్రీనివాసరావు, గంట రాజు, పాతూరి నూకరాజు, శ్రీనివాసరావు , బెన్నాభక్తుల సోమేశ్వరరావు,రౌతు రమ్య ప్రియ, సుజనా మిత్ర కోఆర్డినేటర్లు
సప్పా శ్రీనివాస్, కొల్లి దుర్గారావు, తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News