-ఆర్థిక సంవత్సరం 2025లో దాని 30% వృద్ధి రేటును కొనసాగిస్తూ ఇది రూపొందించబడింది
-సాటిలేని విలువతో విస్తృత శ్రేణి ఎథ్నిక్ వేర్ ఉత్పత్తులను అన్వేషించండి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
టాటా ఉత్పత్తి అయిన తనైరా, ఆర్థిక సంవత్సరం 2025లో 30% వృద్ధిని నమోదు చేసింది. బలమైన వివాహ షాపింగ్ సెంటిమెంట్ ద్వారా ఆర్థిక సంవత్సరం 2026కి అద్భుతమైన ప్రారంభాన్ని పొందింది. ఇది దాని వృద్ధి ధోరణిని కొనసాగిస్తోంది. ఈ వృద్ధి పథాన్ని కొనసాగిస్తూ, బ్రాండ్ తమ మొట్టమొదటి దేశవ్యాప్త అమ్మకాలను ప్రారంభించింది. స్వచ్ఛమైన మరియు సహజమైన వస్త్రాలతో తయారు చేయబడిన చీరలు, రెడీ-టు-వేర్ ఎంసెంబుల్స్, అస్టిచ్డ్ కుర్తా సెట్లు మరియు పండుగ లెహంగాలు వంటి విభాగాలలోని విస్తృత శ్రేణి ఉత్పత్తులపై 40% వరకు తగ్గింపును అందిస్తోంది.
దేశవ్యాప్తంగా 41 నగరాల్లో 80 స్టోర్ ల బలమైన నెట్వర్క్ , గో-టు ఎథ్నిక్ వేర్ గమ్యస్థానంగా తన స్థానాన్ని తనైరా మరింత బలోపేతం చేసుకుంటోంది. పండుగ సీజన్ ప్రారంభం కానున్న వేళ, అంటే చాలా ముందుగానే, ఈ సేల్ సీజన్ ప్రారంభాన్ని ప్రకటించడంతో, తనైరా అందించే విలక్షణమైన డిజైన్ వైవిధ్యం ద్వారా ప్రత్యేకంగా ఉన్న స్వచ్ఛమైన మరియు ప్రామాణికమైన ఉత్పత్తుల శ్రేణిని సొంతం చేసుకునే అవకాశాన్ని వినియోగదారులకు అందించబడుతోంది.
ఈ సందర్భంగా చీఫ్ సేల్స్ మరియు మార్కెటింగ్ ఆఫీసర్ సోంప్రభ కుమార్ సింగ్ మాట్లాడుతూ, “మేము ఇంత విస్తృత శ్రేణిలో పలు ఉత్పత్తులపై 40% వరకు తగ్గింపును మొట్టమొదటిసారిగా అందిస్తున్నాము. ఈ ఆఫర్ తనైరా యొక్క గొప్పతనాన్ని మరియు స్వచ్ఛతను సొంతం చేసుకోవటంలో పొందే అదనపు ప్రయోజనం మాత్రమే. ప్రామాణికంగా రూపొందించిన చేనేత ఉత్పత్తుల యొక్క విస్తృత శ్రేణి మరియు ప్రతి పీస్ లో కనిపించే స్వచ్ఛత మరియు నాణ్యత యొక్క మా వాగ్దానంతో, ఈ అనుభవాన్ని మా వివేకవంతమైన వినియోగదారులకు నిజంగా ప్రత్యేకంగా మార్చాలని మేము లక్ష్యంగా పెట్టుకున్నాము…” అని అన్నారు.
బనారసీలు, కంజీవరంలు, జమ్లానీలు నుండి తస్సార్ వరకు, బ్రాండ్ యొక్క కలెక్షన్ లు భారతదేశపు నేత వారసత్వాలను సంరక్షించే కళాకారులకు ఒక నివాళి. ప్రతి తనైరా స్టోర్ చీర ప్రియులకు స్వర్గధామంగా నిలిచేలా రూపొందించబడింది. వెడ్డింగ్ జోన్స్, పండుగ కోసం ప్రత్యేకంగా తీర్చిదిద్దిన వస్త్రాలతో ఏర్పాటు చేసిన ప్రాంగణాలు మరియు రోజువారీ ధారణకోసం రూపొందించిన వస్త్రాలు… అన్నీ ఒకే చోట లభిస్తాయి. కస్టమర్లు ఇక్కడ ప్యూర్ సిల్క్, కాటన్ ఇకత్, కోట డోరియా, చందేరిస్ మరియు మహేశ్వరిస్, సౌత్ సిల్క్, సంబల్పురి మరియు వీగన్ కలెక్షన్స్ వంటి ఇతర నేత క్లస్టర్ల యొక్క అద్భుతమైన వస్త్ర అవకాశాలను ఎంచుకునే అవకాశం ఉంది. నాణ్యతకు కట్టుబడి, తనైరా సగర్వంగా స్వచ్ఛమైన జరీ కంజీవరంలకు సర్టిఫికేషన్ ను నిజమైన పనితనంకు గుర్తుగా అందిస్తోంది. ప్రతి వస్త్రమూ భారతదేశ గొప్ప వస్త్ర వారసత్వాన్ని వేడుక జరుపుకుంటుందని నిర్ధారిస్తుంది. విజయవాడలోని లబ్బీపేటలోని తనైరా షోరూమ్లో కస్టమర్లు ఈ ఆఫర్ను పొందవచ్చు.
Prajavartha Online Telugu News