రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
యోగంధ్రా మాక్ డ్రిల్ కు సంబంధించిన పూర్తి స్థాయిలో జూన్ 14 నాటికి సన్నద్ధం కావాలని, జిల్లా వ్యాప్తంగా గుర్తించిన ప్రాంతాల్లో పెద్ద సమూహాలతో యోగా సాధన కార్యక్రమం నిర్వహించాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదేశించారు.
గురువారం జిల్లా, డివిజన్, మండల స్థాయి అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ, జిల్లా వ్యాప్తంగా యోగాంధ్ర కార్యక్రమం లో పెద్ద ఎత్తున ప్రజల్ని, అన్ని రంగాలు వారిని భాగస్వామ్యం చేస్తూ, విజయవంతంగా యోగా సాధన చేయాలని పేర్కొన్నారు. ఇప్పటికే వివిధ రంగాల వారితో యోగా సాధన కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు. జిల్లా వ్యాప్తంగా 7 లక్షల 80 వేల మంది తో జూన్ 21 వ తేదీన యోగా సాధన చేయాలని లక్ష్యంగా నిర్దేశించినట్లు పేర్కొన్నారు. జిల్లాలో 7 వేల ప్రాంతాల్లో యోగా సాధన కార్యక్రమం చేపట్టవలసి ఉందన్నారు. పేర్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారిని ప్రతి ప్రాంతానికి ఒక యోగా గురువు ను మ్యాపింగ్ చేస్తూ వివరాలు ఆన్లైన్ లో నమోదు చేసుకోవాలని ఆదేశించారు. మండల ప్రత్యేక అధికారి, తహశీల్దార్లు, మండల అభివృద్ధి అధికారులు యోగాంద్ర లో నమోదు విషయంలో రానున్న రెండు రోజులు ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ ప్రశాంతి తెలిపారు. ఇప్పటి వరకు 5 లక్షల 80 వేల మంది పేర్లు నమోదు చేసుకున్నట్లు తెలిపారు. డి ఆర్ డి ఎ 30 వేలు , డ్వామా 30 వేలు, మెప్మా, పరిశ్రమలు, రవాణా, పాఠశాల విద్యా, ఇంటర్, డిగ్రీ విద్యార్థులు వివరాలు యోగాంద్ర లో నమోదు చేసుకునేలా మాస్ క్యాంపెనింగ్ చేపట్టాలన్నారు. గ్రామ, మండల, గ్రామ పంచాయతీ, సచివాలయాలలో, ముఖ్య కూడళ్లలో మాస్ యోగా సాధన కార్యక్రమం నిర్వహించాలని ఆదేశించారు.
నన్నయ్య యూనివర్సిటీ, గేట్, మెడికల్ కాలేజీ, ఇతర విద్యాలయాలు ఆధ్వర్యంలో ప్రత్యేక యోగా సాధన కార్యక్రమం నిర్వహించాలని, ఆమేరకు చర్యలు తీసుకోవాలన్నారు.
గురువారం సాయంత్రం 6 గంటలకి 6 లక్షల 40 వేల మంది తూర్పు గోదావరి జిల్లా లో నమోదు చేసుకున్నట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు పేర్కొన్నారు. రేపటి నుండి స్కూల్స్ ప్రారంభించనున్న దృష్ట్యా 5 వ తరగతి, ఆ పై పిల్లల వివరాలను యోగాంద్ర లో నమోదు చెయ్యాలని , అదే విధంగా ఇంటర్ మీడియట్ విద్యార్థులను నమోదు చేయడం పై సమన్వయ చేసుకోవాలన్నారు. జిల్లా స్థాయిలో ఎన్రోల్మెంట్ కోసం జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి ఎల్ అప్పల కొండ నోడల్ అధికారి గా నియమించినట్లు తెలిపారు. యోగ సాధన చేసిన వీడియో, ఫోటో క్లిప్స్ కూడా ఎప్పటికప్పుడు వెబ్సైట్ లో నమోదు చేసుకోవాలని సూచించారు. జిల్లాలో ప్రముఖ ప్రాంతాల్లో యోగాంధ్ర కార్యక్రమం డ్రోన్ టెక్నాలజీ ద్వారా రికార్డ్ చెయ్యాల్సి ఉంటుందన్నారు. అందుకు సంబంధించి ఆయా ప్రభుత్వ శాఖలకు సంబంధించి ముందస్తుగా సిద్ధం చేసుకోవాలని కోరారు.
Prajavartha Online Telugu News