యోగాంధ్ర పై పాటలు, కవితలు, డాక్యుమెంటేషన్ పై పోటీలు

-తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషల్లో పోటీలు
-పాటల పోటీలో విజేతలకు లక్ష నగదు పురస్కారం
-దరఖాస్తులకు ఆహ్వానం – జూన్ 13వ తేదీ సాయంత్రం వరకు అవకాశం
-డీఈవో ఆధ్వర్యంలో దరఖాస్తులు స్వీకరణ ప్రత్యేక ఏర్పాట్లు
-ఎస్ కె వి టి ఉన్నత పాఠశాలలో ప్రత్యేక సెల్
-జాయింట్ కలెక్టర్, యోగాంధ్రా జిల్లా నోడల్ అధికారి ఎస్ చిన్న రాముడు

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
యోగేంద్ర పై ప్రజల్లో మరింత బిత్రు స్థాయిలో అవగాహన చైతన్య కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం యోగాంధ్ర పై పోటీలను నిర్వహించడం జరుగుతోందని జిల్లా జాయింట్ కలెక్టర్ జిల్లా యోగాంధ్ర నోడల్ అధికారి ఎస్ చిన్న రాముడు గురువారం ఒక ప్రకటనలో తెలియజేశారు. పోటీలలో పాల్గొనే విభాగాలలో పాటలు , కవితలు , డాక్యుమెంటేషన్ పై పోటీలను నిర్వహిస్తున్నా మన్నారు. పాటలు విభాగంలో పాల్గొనే వారికి లక్ష రూపాయల నగదు పురస్కారం, అదేవిధంగా కవితలు, డాక్యుమెంటేషన్ విభాగంలో పాల్గొనే విజేతలకు రూ.50 వేల రూపాయలు చొప్పున నగదు పురస్కారం అందజేయడం జరుగు తుందన్నారు. తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషల్లో పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. దరఖాస్తులు అందజేయడం కోసం జూన్ 13 వ తేదీ వరకు అవకాశం ఉందని, వొచ్చిన దరఖాస్తులను జూన్ 14 వ తేదీ న రాష్ట్ర ప్రభుత్వంకు పంపడం జరుగుతుందని పేర్కొన్నారు. తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషల్లో పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. పోటీల విజేతలను రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన పోటీల నుంచి ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. మూడు భాషల్లో యోగాంధ్ర పై పాటలు, కవితలు, డాక్యుమెంటేషన్ పై పోటీలలో పాల్గొనే ఆసక్తి కలిగిన వారు ఎం.వి.సుబ్రహ్మణ్యం , హెడ్ ​​మాస్టర్ SKVT ఉన్నత పాఠశాల, రాజమహేంద్రవరం వారికి జూన్ 13 వ తేదీ శుక్రవారం సాయంత్రం 5.00 గంటల లోగా అందచేయాలని పేర్కొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *