రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
గురువారం తూర్పు గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జ్ ఎన్.శ్రీ లక్ష్మి ప్రపంచ బాల కార్మిక వ్యవస్థ వ్యతిరేక దినోత్సవం సందర్భంగా స్థానిక నారాయణపురం సచివాలయం నందు బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన పై న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. 6 నుండి 14 ఏళ్ల వయస్సు ఉన్న పిల్లలకు ఉచిత నిర్భంద విద్య పొందడం వారికి రాజ్యాంగం కల్పించిన హక్కు. ఈ వయస్సులో ఉన్న పిల్లలను కార్మికులుగా మార్చడం చట్ట రీత్యా నేరం, అలా చేస్తే కఠిన చర్యలు తప్పవని తెలియజేశారు. పిల్లల భద్రత దృష్ట్యా సంబంధిత అధికారులు, వ్యవస్థలు మరింత పటిష్టమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు. పిల్లలందరికి మంచి విద్య, స్వేచ్చగా జీవించే పరిస్థితులను కల్పించడం అందరి బాధ్యత అని న్యాయమూర్తి తెలియజేశారు. పిల్లల కు అందుబాటులో ఉన్న ఉచిత న్యాయ సేవల గురించి వివరించారు, ఎలాంటి న్యాయ సహాయం కావాలన్నా జిల్లా న్యాయ సేవాధికార సంస్థకు తెలియజేయాలన్నారు. వారి సమస్యలను ఎప్పటికప్పుడు సంస్థ దృష్టికి తీసుకురావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా బాల కార్మికలను గుర్తించడానికి కొన్ని బృందాలను ఏర్పరచి పట్టణంలోని పలు ప్రాంతాలలో తనిఖీ చేసేందుకు ఆదేశాలు జారీ చేశారు. ఈ తనిఖీలకు సంబంధించిన నివేదికను జిల్లా న్యాయ సేవాధికార సంస్థకు అందించాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా గిరిజన సంక్షేమ అధికారి కె ఎన్. జ్యోతి, డిస్ట్రిక్ట్ బి.సి వెల్ఫేర్ ఆఫీసర్ బి.శశాంక, రాజమహేంద్రవరం అర్బన్ తాహాసీల్దార్ పి. హెచ్.జి.ఆర్. పాపా రావు, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సెక్షన్ ఆఫీసర్ డి. ఎస్తర్ రాణి, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్లు లలిత, ఏ. విజయ ప్రకాష్, షెక్ జబీనా, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డవేలోప్మెంట్ లీగల్ ఆఫీసర్ శ్రీగౌరి, పోలీసు అధికార్లు, లీగల్ డిఫెన్స్ కౌన్సెల్ సభ్యులు, పారా లీగల్ వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News