విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
గిరిజనులకు మెరుగైన సేవలు అందించడం మరియు రాష్ట్రంలో సుపరిపాలన అందించే దిశగా వివిధ పథకాలను విజయవంతంగా నిర్వహిస్తున్నందుకు గాను గిరిజన సంక్షేమ శాఖ మరియు ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డ్ తెగల సహకార ఆర్ధికసంస్థ (ట్రైకార్)నకు హైదరాబాదుకు చెందిన హెచ్.వై.ఎం ఇంటర్నేషనల్ సంస్థ ఆడిట్ నిర్వహించి గత 3 సంవత్సరాలుగా ISO 9001: 2015 ధృవపత్రంను పి.రంజిత్ బాషా ఐ.ఏ.ఎస్., సంచాలకులు, గిరిజన సంక్షేమ శాఖ మరియు ఇ. రవీంద్ర బాబు కార్యనిర్వాహక సంచాలకులు, ట్రైకార్ వారికి అందజేస్తున్నది. సంక్షేమ పథకాలు నిర్విరామంగా ఆమలుచేస్తూ, గిరిజనులకు సుపరిపాలన అందిస్తున్నందుకుగాను గిరిజన సంక్షేమ శాఖ మరియు ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డ్ తెగల సహకార ఆర్ధిక సంస్థ (ట్రైకార్) నందు విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులను కాంతిలాల్ దండే, ఐ.ఏ.ఎస్., గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి అభినందించారు.