-నాడు నేడు కింద రూ.13.54 కోట్ల తో 57 పాఠశాలలు అభివృద్ధి
ఏలూరు, నేటి పత్రిక ప్రజావార్త :
జగనన్న కానుక గా కొవ్వూరు నియోజకవర్గ పరిధిలోని కొవ్వూరు, చాగల్లు, తాళ్లపూడి మండలాల పరిధిలో 8762 మంది బాలురకు, 9199 మంది బాలికలకు కిట్స్ పంపిణీ చేస్తున్నట్లు కొవ్వూరు మండల విద్యాధికారిణి కె.రత్నం తెలిపారు. సోమవారం కొవ్వూరు ప్రభుత్వ పాఠశాల ఆవరణలో జగనన్న విద్యా కానుక కిట్లు పంపిణీ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా కె.రత్నం మాట్లాడుతున్న కొవ్వూరు నియోజకవర్గ స్థాయిలోని 3 మండలాలు పరిధిలో జగనన్న విద్యా కానుక గా చాగల్లు లో 5202 మందికి, కొవ్వురు లో 8126, తాళ్లపూడి లో 13899 మంది విద్యార్థుల కిట్లు పంపిణీ పాఠశాలలు ప్రారంభం సందర్భంగా ప్రారంభించామని తెలిపారు. తల్లుల సమక్షంలో విద్యార్థులకు కిట్లు అందచెయ్యడం జరిగిందన్నారు. ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న జగనన్న కానుక కోసం రూ.1530 చొప్పున వ్యయం ఖర్చు చేసినట్లుగా తెలిపారు.
ఆగస్ట్ 16 నుంచి ప్రారంభం కానున్న పాఠశాలలు…
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన జగనన్న విద్యకానుకగా ఒకటి నుంచి 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు పుస్తకాలు, 3 జతల డ్రెస్, నోటు బుక్స్, షూస్, రెండు జతల సాక్సు లు, స్కూల్ బ్యాగ్, బెల్ట్, బ్యాగ్, ఆక్సఫర్డ్ నిఘంటువు (తెలుగు – ఇంగ్లీష్ ) అందిస్తున్నట్లు కెంపు రత్నం పేర్కొన్నారు. నియోజకవర్గ పరిధిలోని విద్యార్థుల కోసం అవసరమైన 98 వేల పుస్తకాలు సిద్ధం చేసి సంబంధించిన స్కూల్స్ కు చేరవేయ్యడం జరిగిందన్నారు. నాడు నేడు కింద కొవ్వూరు నియోజకవర్గ స్థాయిలో 57 స్కూల్స్ 13 కోట్ల 54 లక్షలతో అభివృద్ధి చెయ్యడం జరిగిందన్నారు. రెండవ దశలో మరో 60 స్కూల్స్ అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. రెండవ దశలో కొవ్వూరు పరిధిలోని 27 స్కూల్స్, చాగల్లు లో 18, తాళ్లపూడి లో 15 స్కూల్స్ అభివృద్ధి కి కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసినట్లు రత్నం తెలిపారు.ఈనెల 30 వరకు కిట్లు పంపిణీ చెయ్యడం జరుగుతుందన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ఈ విద్యా సంవత్సరం కోసం విద్యార్థులకు అవసరమైన అన్ని పుస్తకాలను ముందస్తుగా నే సిద్ధం చేసుకోవడం పట్ల విద్యార్థుల తల్లిదండ్రులు, పాఠశాల కమిటీ సభ్యులు సంతృప్తి వ్యక్తం చెయ్యడం జరిగిందని తెలిపారు. పేద నిరుపేదలకునాడు నేడు కింద పాఠశాల ల రూపురేఖలు కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా జగనన్న ప్రభుత్వం అభివృద్ధి చేసినట్లు తెలిపారు. విద్యార్థుల మోములో చిరునవ్వు ఎంతో సంతృప్తినిచ్చిందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో హెచ్ ఎమ్ ఎమ్.తిరుమల దాస్, పేరెంట్ కమిటీ ఛైర్మన్ షేక్ భాషా, వైస్ చైర్ పర్సన్ ఎన్. సత్యవతి , కో ఆర్డినేటర్ ఏ.చంద్ర కుమార్ , విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.