నూజివీడు, నేటి పత్రిక ప్రజావార్త :
గన్నవరం విమానాశ్రయ విస్తరణకు భూములు అందించిన వారు తమ డాక్యుమెంట్లను సంబంధిత రెవెన్యూ అధికారులతో ధృవీకరించుకోవాలని ఆర్ డివో కె. రాజ్యలక్ష్మి విజ్ఞప్తి చేశారు. గన్నవరం విమానాశ్రయం విస్తరణకు భూములు అందించిన అల్లాపురం, బుద్ధవరం, దావాజీగూడెం గ్రామాలకు చెందిన వారిలో ఇంతవరకు 250 మంది మాత్రమే తమ భూములను సంబంధించిన డాక్యుమెంట్లను అధికార్ల వద్ద ధృవీకరించుకున్నారని, మిగిలిన వారు తమ దగ్గరలోని తాహశీల్దారు కార్యాలయంలో కానీ లేదా నూజివీడు సబ్ కలెక్టరు కార్యాలయంలో సంబంధిత అధికార్లకు తమ డాక్యుమెంట్లను సమర్పించి ధృవీకరించుకోవాలన్నారు.
Tags nuzividu
Check Also
డిసెంబరు 30 న రాజానగరం ఎంపీడీవో కార్యాలయంలో జాబ్ మేళా
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ మరియు జిల్లా ఉపాధి సంస్థ ఆధ్వర్యంలో తూర్పుగోదావరి …