అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
కోవిడ్ –19 నివారణ, నియంత్రణ, వ్యాక్సినేషన్‌పై రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి క్యాంప్ కార్యాలయంలో మంగళవారం సమీక్షించారు. ఈ సమీక్షా సమావేశంలో సీఎం వైయస్ జగన్ మాట్లాడుతూ స్కూళ్లు తెరిచినందున అక్కడ కోవిడ్ ప్రోటోకాల్స్ సమర్థవంతంగా పాటించేలా చర్యలు తీసుకోవాలి: అధికారులకు సీఎం వైయస్.జగన్ స్పష్టం చేసారు. వైద్య ఆరోగ్య శాఖ మార్గదర్శకాలను పాటించేలా అధికారులు దృష్టిపెట్టాలన్నారు. దీనిపై ఆరోగ్యశాఖ అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు. మాస్క్‌లు ధరించేలా, భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలన్నారు. స్కూళ్లలో టెస్టింగ్‌కు కూడా చర్యలు తీసుకోవాలన్నారు. ఒకవేళ ఎవరికైనా లక్షణాలు కనిపిస్తే వెంటనే పరీక్షలు చేసేలా చూడాలన్నారు. థర్డ్‌వేవ్ నేపథ్యంలో ముందస్తుగా తీసుకోవాల్సిన చర్యలపైనా సీఎం సమీక్ష నిర్వహించారు. వ్యాక్సినేషన్‌లో గ్రామ, వార్డు సచివాలయాన్ని ఒక యూనిట్‌గా తీసుకోవాలన్నారు. ప్రాధాన్యతా క్రమంలో వ్యాక్సిన్ ఇచ్చుకుంటూ వెళ్లాలన్నారు. ఉదయం 6 గంటలనుంచి రాత్రి 11 గంటలవరకూ కర్ఫ్యూ సడలింపులు. తెల్లవారు జామున పెళ్లిళ్లు ఉంటే… ముందస్తుగా అనుమతి తీసుకోవాలి. పెళ్లిళ్లలో 150 మందికే అనుమతి. కోవిడ్ ప్రోటోకాల్స్ పాటించేలా అధికారులు స్వయంగా పర్యవేక్షించాలన్నారు. ఉల్లంఘించేవారిపై చర్యలు తీసుకోవాలన్నారు. కోవిడ్ నివారణ, నియంత్రణ చర్యలతో పాటు వ్యాక్సినేషన్ పై సీఎంకు అధికారులు వివరాలందించారు.
యాక్టివ్ కేసులు 17,218
రికవరీ రేటు 98.45 శాతం
పాజిటివిటీ రేటు 1.94 శాతం
3 శాతం కంటే తక్కువ పాజిటివిటీ రేటు నమోదైన జిల్లాలు 10
3 నుంచి 6 శాతంలోపు పాజిటివిటీ నమోదైన జిల్లాలు 3
నెట్‌వర్క్ ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ కింద చికిత్స పొందుతున్న బెడ్లు 93.98శాతం
ప్రైవేటు ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ కింద చికిత్స పొందుతున్న బెడ్లు 74.82 శాతం
104 కాల్ సెంటర్‌కు వచ్చిన ఇన్ కమింగ్ కాల్స్ 571
థర్డ్ వేవ్ సన్నద్దత
అందుబాటులో ఉన్న ఆక్సిజన్ కాన్సంట్రేటర్స్ 20,464
డి టైప్ ఆక్సిజన్ సిలిండర్లు 27,311
ఆగష్టు నెలాఖరునాటికి 104 చోట్ల ఆక్సిజన్ జనరేషన్ (పీఎస్‌ఏ) ప్లాంట్లు ఏర్పాటు పూర్తి
మరో 36 చోట్ల సెప్టెంబరు రెండోవారానికి పూర్తి చేయనున్నట్లు తెలిపిన అధికారులు
వ్యాక్సినేషన్
మొత్తం వాక్సినేషన్ తీసుకున్నవారు 1,82,00,284
సింగిల్ డోసు వ్యాక్సిన్ తీసుకున్నవారు 1,15,98,720
రెండు డోసుల వ్యాక్సిన్ పూర్తయిన వారు 66,01,563
ఉపయోగించిన మొత్తం వ్యాక్సిన్ 2,48,01,847 డోసులు
ఔషధ నియంత్రణశాఖపైనా సీఎం సమీక్ష
సమర్థవంతమైన ఔషధ నియంత్రణ, పరిపాలన కోసం వెబ్‌సైట్
ఔషధాల నాణ్యత, ప్రమాణాలను పాటించేలా చేయడంలో దోహదకారిగా కంప్యూటర్ ఎయిడెడ్ సెలక్షన్ ఆఫ్ ఇన్స్ఫెక్షన్ – ‘సీఏఎస్‌ఐ’ పేరిట నూతన వెబ్‌సైట్
వెబ్‌సైట్‌లోని అంశాలను సీఎంకు వివరించిన అధికారులు
తయారీ సంస్థలనుంచి రిటైల్ దుకాణాల వరకూ కూడా దీని పరిధిలోకి వస్తాయన్న అధికారులు
టెలిఫోన్, వాట్సాప్, మెయిల్.. ఇతరత్రా మార్గాల ద్వారా కూడా ఫిర్యాదులను స్వీకరిస్తామన్న అధికారులు
తనిఖీల్లో పారదర్శకత, నాణ్యత, నిరంతర ఫాలోఅప్ కోసమే కొత్త వెబ్‌సైట్ అని తెలిసిన అధికారులు
డ్రగ్స్ తనిఖీల్లో గుర్తించిన అంశాలపై ఫాలో అప్ ఉండాలన్న సీఎం
నిర్దేశిత సమయంలోగా ఇచ్చిన సూచనలు, ఆదేశాలను అమలు చేశారా? లేదా? అన్నదానిపై నిర్ణీత కాలం తర్వాత మళ్లీ తనిఖీలు చేయాలన్న సీఎం
వెబ్‌సైట్ నిర్వహణపై సిబ్బందికి శిక్షణ ఇవ్వాలన్న సీఎం
ప్రభుత్వ ఆస్పత్రుల్లోని మందులపైనా కూడా నిరంతరం తనిఖీలు చేయాలన్న సీఎం
జీఎంపీ ప్రమాణాలు పాటిస్తున్నారా?లేదా? అన్నదానిపై నిరంతరం తనిఖీలు చేయాలన్న సీఎం
ప్రభుత్వ ఆస్పత్రుల్లోని డ్రగ్‌స్టోర్లను కచ్చితంగా తనిఖీలు చేయాలన్న సీఎం
మందులు నాణ్యతతో లేకపోతే ప్రభుత్వ ప్రతిష్ట దెబ్బతింటుందన్న సీఎం
ఔషధాల్లో కల్తీలను నివారించడానికి ప్రివెంటివ్ యాక్షన్ థ్రూ డ్రగ్ సర్వేలెన్స్– ‘పీఏడీఎస్’ (పాడ్స్) పేరిట మరొక వెబ్‌సైట్
డ్రగ్స్ తయారీ దారులు నుంచి పంపిణీదారుల వరకూ ట్రాకింగ్
ఏ కంపెనీ నుంచి డ్రగ్ తయారీ అవుతుంది, లైసెన్స్‌లు ఉన్నాయా? లేవా తదితర అంశాలన్నింటిపైనా కూడా తనిఖీ ఉంటుందన్న అధికారులు
గతంలో అజిత్రోమైసిన్ మందును ఉత్తరాఖండ్ లో ఒక కంపెనీ తయారు చేసినట్టుగా చెప్పారని, ఆరా తీస్తే అలాంటి కంపెనీ ఏమీ లేదని, వారు తయారుచేసిన టాబ్లెట్లలో ఎలాంటి డ్రగ్‌లేదని తెలిపిన అధికారులు
ఇలాంటి వాటి నివారణకు ఈ వెబ్‌సైట్ ఉపకరిస్తుందని తెలిపిన అధికారులు
అంతేకాకుండా ప్రభుత్వం వద్ద ఔషధ కంపెనీల రిజిస్ట్రేషన్ అంశాన్ని కూడా పరిశీలించాలన్న సీఎం
క్రమం తప్పకుండా ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ జరిగేలా చూసే అవకాశాన్ని పరిశీలించాలన్న సీఎం
దీనివల్ల వారి ఉత్పత్తులపై ఎప్పటికప్పుడు తనిఖీలు జరుగుతాయన్న సీఎం
డ్రగ్ డీలర్లు పంపిణీచేస్తున్న మందులకు సంబంధించి ఒక వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తీసుకొచ్చామని, దీనివల్ల ట్రాకింగ్ సులభం అవుతుందని తెలిపిన అధికారులు
పిల్లల్లో న్యుమోనియా మరణాల నివారణకు వ్యాక్సినేషన్‌పై సీఎం సమీక్ష
న్యూమోనియా నివారణకు ఇకపై న్యూమోకోకల్ కాంజ్యుగట్ వ్యాక్సిన్‌ను (పీసీవీ) ఇవ్వనున్నట్లు తెలిపిన అధికారులు
పిల్లలకు ఈ వ్యాక్సిన్ ఇచ్చేందుకు తీసుకుంటున్న చర్యలను సీఎంకు వివరించిన అధికారులు
ఇప్పటివరకు పిల్లలకు 9 రకాల వ్యాక్సిన్లు అందిస్తున్న ప్రభుత్వం
కొత్తగా ఇస్తున్న న్యూమోకోకల్‌తో కలిపి మొత్తంగా 10 రకాల వ్యాక్సిన్లు పిల్లలకు ఇవ్వనున్నట్టు తెలిపిన అధికారులు
వ్యాక్సినేషన్ కోసం గ్రామ, వార్డు సచివాలయాలను వినియోగించుకోవాలన్న సీఎం
విలేజీ, వార్డు క్లీనిక్కులు ఏర్పాటైన తర్వాత అక్కడ నుంచి పిల్లలకు సమర్థవంతంగా వ్యాక్సినేషన్ అందించాలని సీఎం ఆదేశం
నిర్దేశించిన విధంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో రిక్రూట్‌మెంట్ పూర్తిచేయాలన్న సీఎం
పీహెచ్‌సీలు మొదలుకుని సీహెచ్‌సీలు బోధనాసుపత్రుల వరకు రిక్రూట్‌మెంట్ పూర్తిచేయాలన్న సీఎం
90 రోజుల్లోగా ఈ ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులకు స్పష్టం చేసిన సీఎం
ఆతర్వాత ఎక్కడా కూడా సిబ్బంది లేరన్న మాట వినిపించకూడదన్న సీఎం
ప్రజలకు వైద్య సేవలు అందడంలో ఎలాంటి ఇబ్బందులు రాకూడదని స్పష్టంచేసిన సీఎం
ఆస్పత్రుల్లో నాడు – నేడు పనులను కూడా వేగంగా ముందుకు తీసుకెళ్లాలని సీఎం ఆదేశం
ఈ సమీక్షా సమావేశానికి ఉపముఖ్యమంత్రి ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్ (నాని), సీఎస్ ఆదిత్యనాథ్ దాస్, డీజీపీ గౌతం సవాంగ్, కోవిడ్ టాస్క్‌ఫోర్స్ కమిటీ ఛైర్మన్ ఎం టీ కృష్ణబాబు, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి (కోవిడ్ మేనేజిమెంట్ అండ్ వ్యాక్సినేషన్) ఎం రవిచంద్ర, 104 కాల్ సెంటర్ ఇంఛార్జి ఎ బాబు, ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ కాటమనేని భాస్కర్, ఆరోగ్యశ్రీ సీఈఓ వి వినయ్ చంద్, ఏపీఎంస్‌ఐడీసీ వీసీ అండ్ ఎండీ డి మురళీధర్ రెడ్డి, వైద్య ఆరోగ్యశాఖ డైరెక్టర్ (డ్రగ్స్) రవి శంకర్ ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు