ధ్రువీకరణ లేని వారి ఆస్తులపై రీ సర్వే ద్వారా హక్కులు… : కలెక్టర్ జె. నివాస్

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
గ్రామంలోని ప్రతి నివాసాన్ని,ఇంటి స్థలాలను రోవర్లతో డిజిటల్ విధానంలో కొలతలు వేశారని, యజమాని వివరాలను కంప్యూటర్లలో నమోదు చేసి..ఇంటి హక్కుల టైటిల్స్ సిద్ధం చేసి ఏళ్లుగా నివాసం ఉంటున్నా ఎలాంటి ధ్రువీకరణలేని వారికీ రీ సర్వే ద్వారా సదరు ఆస్తులపై హక్కులు ఏర్పడతాయని కృష్ణాజిల్లా కలెక్టర్ జె. నివాస్ తెలిపారు.
మంగళవారం మధ్యాహ్నం ఆయన మచిలీపట్నం మండల పరిధిలోని పొట్లపాలెం గ్రామాన్ని సందర్శించారు. గ్రామ పంచాయితీ కార్యాలయంలోని రైతుభరోసా కేంద్రం వద్ద ‘వైఎస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు-భూరక్ష’ పథకం కింద జరుగుతున్న రీసర్వే కార్యక్రమం ఏ విధంగా అమలవుతుందనే విషయంపై కలెక్టర్ పలువురు అధికారులతో సమీక్షించారు. కేంద్ర బృందం గ్రామస్థాయిలో రీ సర్వే తీరును పరిశీలించేందుకు బుధవారం పొట్లపాలెం గ్రామాన్ని పర్యటించనుంది. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ జె. నివాస్ వివిధ శాఖల అధికారులకు పలు సూచనలు చేశారు.ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో డ్రోన్, రోవర్ల సహకారంతో భూసర్వే సమగ్ర సర్వే కోసం పంచాయతీ కార్యదర్శులు, డిజిటల్ అసిస్టెంట్లు, గ్రామ సర్వేయర్లు ఏ విధంగా మ్యాప్ ను రూపొందించారో జిల్లా కలెక్టర్ అడిగి తెలుసుకోన్నారు. ల్యాండ్ అండ్ రికార్డ్స్ , రెవిన్యూ , పంచాయితీ అధికారులతో రీ సర్వే కు సంబంధించిన పలు సూచనలు కలెక్టర్ తెలియచేశారు. రీ సర్వే ద్వారా భవిష్యత్తులో భూ వివాదాలకు చరమగీతం పడనుందని ఆయన అన్నారు. ఇళ్లు, ఇంటి స్థలాలపై తమ పేరిట హక్కులు కల్పించడంపై పొట్లపాలెం గ్రామస్తులు పలువురు గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రయోగాత్మక రీ-సర్వేతో పెరిగిన పొలాల్లో సర్వే నెంబర్లూపెరిగాయిని పొట్లపాలెం గ్రామంలో గతంలోని సర్వే నెంబర్ల కన్నా అధికంగా రీ-సర్వే తర్వాత వీటి సంఖ్య పెరిగిందని ,మొదటి నుంచి వస్తున్న సర్వే నెంబర్లకు అనుబంధంగా మ్యూటేషన్ చేయించుకున్న రైతులు… 1, 2, A లేదా B పేర్లతో పట్టాలు పొందారు. దీనివల్ల సర్వే నెంబర్లు పెరిగాయిని దీంతో పలు పంచాయితీలకు ఆదాయం పెరగనుందని కలెక్టర్ గ్రామస్థులకు తెలిపారు . కేంద్రబృందం పరిశీలనకు వచ్చినపుడు పొట్లపాలెం గ్రామంలో ఎవరైనా ఇంగ్లిష్ మాట్లాడగలవారెవరైనా ఉంటే వారిని రీ సర్వే గురించి మాట్లాడే అవకాశం ఇద్దామని కలెక్టర్ అధికారులకు చెప్పారు. ఎవరూ ముందుకు రాని పక్షంలో అనువాదం చేసి గ్రామస్తులకు అర్థమయ్యేలా వివరించాలని ఆదేశించారు . ప్రస్తుత వాతావరణాన్ని దృష్టిలో ఉంచుకొని వర్షంలో కేంద్ర బృందం ఇబ్బంది పడకుండా పొట్లపాలెం పంచాయితీ కార్యాలయం వద్ద వాటర్ ప్రూఫ్ షామియానాలు వేయాలని ఫోటో ఎగ్జిబిషన్ ను నూతనంగా నిర్మించిన రైతు భరోసా కేంద్రంలో ఏర్పాటుచేయాలని కలెక్టర్ జె. నివాస్ సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ కె. మాధవీలత, జిల్లా పంచాయితీ అధికారిణి ఏ.డి. జ్యోతి, మచిలీపట్నం రెవిన్యూ డివిజనల్ అధికారి ఎన్.ఎస్.కె. ఖాజావలి, డి ఎల్ పి ఓ. ఐ. జ్యోతిర్మయి, మచిలీపట్నం తహశీల్ధార్ సునీల్ బాబు, ఆర్ ఐ యాకూబ్ తదితర అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *