విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ డివిజన్లో ఖాళీగా ఉన్న అంగన్‌వాడీ పోస్టుల భర్తీకి మంగళవారం స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో సబ్ కలెక్టర్ జి, సూర్యసాయి ప్రవీణ్ చంద్ అధ్యక్షతన కమిటిచే ఇంటర్వ్యూలు నిర్వహించబడ్డాయి. మహిళాభివృద్ధి శిశుసంక్షేమ శాఖ విజయవాడ డివిజన్లో సంబంధించి విజయవాడ – 1, 2, కంకిపాడు, ఉయ్యూరు, కంచికచర్ల, మైలవరం, నందిగామలకు చెందిన 7 ప్రాజెక్టుల్లో 10 అంగన్‌వాడీ కార్యకర్త పోస్టులు, 94 సహాయకురాలు, 2 మిని కార్యకర్తల పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఇందుకు గాను 450 ఇంటర్వ్యూలకు హాజరైయ్యారు. ఇంటర్వ్యూ కమిటీ సభ్యులైన మహిళ అభివృద్ధి శిశుసంక్షేమ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ ఉమారాణి, పలువురు సిడిపిఓలు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News