ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త :
శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాత కనకదుర్గమ్మను కేంద్ర సాంస్కృతిక, పర్యాటక మరియు డెవలప్మెంట్ ఆఫ్ నార్త్ ఈస్ట్ రీజియన్ మంత్రి జి.కిషన్ రెడ్డి గురువారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ప్రిన్సిపల్ సెక్రటరీ జి.వాణీ మోహన్, ఆలయ పాలకమండలి చైర్మన్ పైలా సోమినాయుడు, ఆలయ కార్యనిర్వహణాధికారి డి.భ్రమరాంబ ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి కి శ్రీ అమ్మవారి దర్శనం కల్పించి, పూజలు నిర్వహించారు. అనంతరం కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి కుటుంబమునకు ఆలయ స్థానాచార్యులు వారి ఆధ్వర్యంలో వైదిక కమిటీ సభ్యులు మరియు వేదపండితులు వేదాశీర్వచనం చేయగా, రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ శ్రీ అమ్మవారి ప్రసాదములు మరియు చిత్రపటం అందజేశారు.
Tags indrakiladri
Check Also
డిసెంబరు 30 న రాజానగరం ఎంపీడీవో కార్యాలయంలో జాబ్ మేళా
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ మరియు జిల్లా ఉపాధి సంస్థ ఆధ్వర్యంలో తూర్పుగోదావరి …