Breaking News

ఆర్టీసీ (పిటిడి) ఉద్యోగులకు పదోన్నతులు ఇచ్చేటప్పుడు రిక్వెస్ట్ ట్రాన్స్ ఫర్స్ ను క్లియర్ చేయాలి… : ఇ.యు విజ్ఞప్తి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆర్టీసిలో ఇప్పటికే ఆరేళ్లుగా పదోన్నతులు కోసం ఎదురు చూస్తూ సుమారు 2000 మంది ఉద్యోగులు రిటైర్ అయ్యారని. పదోన్నతులకు ప్రభుత్వం నుండి అనుమతులు రావడంలో జాప్యం జరుగుతున్నందున సుమారు 100 మంది అధికారులు కేవలం ఇంచార్జి బాద్యతలతో సరిపెట్టుకొని నెట్టుకొస్తున్నారని, క్రింది స్థాయి కేటగిరి ఖాళీలు మాత్రం ఖాళీగా ఉండి పోయి సూపర్ వైజర్లు/ ఏడిసి/ క్లర్క్లు/ కంట్రోలర్లు లేక రాష్టంలోని అన్ని డిపో/ యూనిట్లలో సుమారుగా 70% వరకు ఇబ్బందులు పడుతున్నారని, ఈ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఆర్టీసి ఉద్యోగులకు సంబందించి ముఖ్యమంత్రి కార్యాలయం వద్ద పదోన్నతుల కోసం వేచి ఉన్న పైల్ కు వెంటనే అనుమతులు ఇచ్చేలా వి.సి & యం.డి మరియు ప్రభుత్వ ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని ఇ.యు రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పలిశెట్టి దామోదరరావు, జి.వి.నరసయ్యలు కోరారు.

గత ఆరేళ్లుగా పెండింగులో వున్న ఆర్టీసీ (ఏపిపిటిడి) ఉద్యోగుల పదోన్నతుల కొరకు ఉద్యోగ సంఘాలు చేస్తున్న విజ్ఞప్తులు మేరకు వి.సి & యం.డి ద్వారక తిరుమలరావు కృషితో ఎట్టకేలకు కూటమి ప్రభుత్వం అనుమతి ఇచ్చే సందర్బంగా ఆర్టీసిలో పనిచేస్తున్న అసిస్టెంట్ మెకానిక్ కేడర్ నుండి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ల స్థాయి ఉద్యోగులకు పదోన్నతులు ఇచ్చేటప్పుడు ఎన్నో ఏళ్ల నుండి రిక్వెస్ట్ ట్రాన్స్ పర్స్ పెట్టుకొని ఎదురు చూస్తున్న సుమారు 3000 మంది ఆర్టీసీ ఉద్యోగులకు రిక్వెస్ట్ బదిలీలు ఇచ్చుకొనేటందుకు ప్రభుత్వం నుండి అనుమతి తీసుకొని పదోన్నతులతో పాటు రిక్వెస్ట్ బదిలీలు ఇచ్చి అందరికి న్యాయం జరిగేలా చూడాలని సోమవారం ఆర్టీసి యం.డి కి లేఖ ఇచ్చి విజ్ఞప్తి చేశామని ఏపిపిటిడి (ఆర్టీసి) ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు పలిశెట్టి దామోదరరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.వి.నరసయ్య ఒక ప్రకటన ద్వారా తెలియజేసారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

“తాలీమ్-ఎ-హునర్ (వక్ఫ్ ఎడ్యుకేషన్ మిషన్)” కార్యక్రమం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్‌టీఆర్ జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి తెలియజేయునదేమనగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్ బోర్డు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *