-సచివాలయానికి 200 చొప్పున 800 సచివాలయాలకు లక్షా60 వేల మోతాదులు అందించాం…
-కంట్రోలు రూమ్ ద్వారా ఉదయం 6 గం. నుంచే వ్యాక్సినేషన్, డేటా ఎంట్రీ ప్రక్రియ ను పర్యవేక్షించాలి…
-మంగళవారం నిర్వహించే ప్రత్యేక డ్రైవ్ కు సోమవారం ముందస్తు ప్రణాళికను సిద్దం చేసుకోవాలి…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కోవిడ్ నియంత్రణంలో భాగంగా జిల్లా లో 18 నుండి 45 సం.రం.ల వయస్సు గల వారికి వ్యాక్సినేషన్ అందించే ప్రత్యేక వ్యాక్సినేషన్ డ్రైవ్ కు ముందస్తు ప్రణాళికను స్దిదం చెయ్యాలని కలెక్టరు జె. నివాస్ అధికారులను ఆదేశించారు. ఆదివారం జిల్లా కలెక్టరు జె. నివాస్ నగరంలోని క్యాంపు కార్యాలయం నుంచి మంగళవారం నిర్వహించాల్సిన స్పెషల్ వ్యాక్సినేషన్ కాంపైన్ పై జాయింట్ కలెక్టరు, సబ్ కలెక్టర్లు, ఆర్డీవోలు, డీఎంహెచ్ఓ, జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి, డివిజన్ స్థాయి అధికారులతో టెలి కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్బంగా కలెక్టరు జె. నివాస్ మాట్లాడుతూ జిల్లాలో 18 నుంచి 45 ఏళ్లు లోపు గల వారిందరికీ సచివాలయాలు ద్వారా కోవిడ్ వ్యాక్సినేషన్ మోతాదులను అందించాలన్నారు. ఈ మేరకు మంగళవారం నిర్వహించే ప్రత్యేక వ్యాక్సినేషన్ కార్యక్రమానికి లక్షా 60 వేల వ్యాక్సినేషన్ మోతాదులను అందించడం జరుగుతుందన్నారు. ఇప్పటికే 84 వేల మోతాదులను అందించామని రేపు మరో 80 వేల మోతాదులను అందించడం జరుగుతుందన్నారు. జిల్లాలోని ప్రతి సచివాలయాల్లో రేపు ఉదయం విఆర్వో, ఆశా, ఎఎన్ఎమ్, సెక్రటరీ, వాలంటీర్లతో సంబందిత యంపీడివో, వైద్యాధికారులు సమావేశాలు ఏర్పాటు చేసి మంగళవారం నిర్వహించే వ్యాక్సినేషన్ డ్రైవ్ ప్రణాళికను సిద్దం చేసుకోవాలన్నారు. ప్రతి సచివాలయానికి 200 మోతాదులు చొప్పున జిల్లాలోని 800 సచివాలయాలకు వ్యాక్సినేషన్ అందించడం జరగుతుందన్నారు. ఇప్పటికే జిల్లా ఇమ్యూజేషన్ అధికారి గ్రామాల వారీ 18 నుంచి 45 ఏళ్లు గల వారి జాబితాలను సంబందిత సచివాలయాలకు పంపించారన్నారు. జాబితాలు వారి ప్రతి వాలెంటీర్లు వ్యాక్సిన్ వేయించేందుకు తమ పరిదిలో 15 నుంచి 20 మందిని సచివాలయాలకు తీసుకురావాలని ఆదేశించారు. సెంకండ్ డోస్ కొరకు వ్యాక్సిన్ మిగల్చవద్దని వచ్చిన అందరికీ వ్యాక్సిన్ వేసి లక్ష్యాలను పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలన్నారు. జిల్లాలో వ్యాక్సినేషన్ ప్రక్రియ విజయవంతంగా కొనసాగుతున్నప్పటికీ డేటా ఎంట్రీ ఆన్ లైన్ చేయడం జాప్య జరుగుతుందని, అలాకాకుండా డేటా ఎంట్రీ పక్కాగా నిర్వహించాలన్నారు. ఎల్లుండి మంగళవారం ఉదయం 6 నుంచే కంట్రోలు రూమ్ ద్వారా జిల్లాలో నిర్వహిస్తున్న వ్యాక్సినేషన్ ప్రక్రియను, డేటా ఎంట్రీ ఆన్ లైన్ నమోదును గంట గంటకు పర్యవేక్షించాలని కలెక్టరు కంట్రోల్ రూమ్ అధికారులను ఆదేశించారు. నూజివీడు డివిజన్ కు 50 వేలు, బందరు డివిజన్ కు 50 వేలు, గుడివాడ డివిజన్ కు 10వేలు, విజయవాడ డివిజన్ కు 50 వేలు వ్యాక్సినేషన్ మోతాదులను అందిస్తున్నట్లు కలెక్టరు జె. నివాస్ వెల్లడించారు. మంగళవారం నిర్వహించనున్న వ్యాక్సినేషన్ కార్యక్రమానికి సంబందించి రేపు నిర్వహించే సమావేశపు ఫోటోలను అప్ లోడ్ చెయ్యాలని మండల స్థాయి అధికారులను కలెక్టరు ఆదేశించారు.
కలెక్టరు జె నివాస్ నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్ లో జాయింట్ కలెక్టరు (అభివృద్ది) ఎల్. శివశంకర్, విజయవాడ సబ్ కలెక్టరు జి. సూర్య సాయి ప్రవీణ్ చంద్, డీఎంహెచ్ఓ సుహాషిని, డిఐఓ షర్మిల, నూజీవీడు ఆర్డీవో రాజ్యలక్ష్మి, బందరు ఆర్డీవో ఖాజావలి, మండల అభివృద్ది అధికారులు తదితరు పాల్గొన్నారు.