విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సివిల్ సర్వీసెస్ కు ప్రిపేర్ అవుతూ రానున్న అక్టోబర్ నెల 10వ తారీఖున UPSC-2021 ప్రేలిమ్స్ పరిక్ష రాయబోతున్న అభ్యర్ధులకు ఉపయుక్తమైన UPSC Test Series కు సంబందించిన పోస్టర్ ను కమీషనర్ ప్రసన్న వెంకటేష్, ఐ .ఎ.ఎస్ విడుదల చేశారు. ప్రేలిమ్స్ పరిక్ష రాయబోతున్న అభ్యర్ధులకు U.P.S.C Test Series ఉచితంగా అందిస్తున్నట్లు విద్యాదర్శిని ఐ .ఎ.ఎస్ అకాడమి డైరెక్టర్ విజయ కుమార్ తెలిపారు. మాక్ టెస్ట్ సిరీస్ ప్రతి శని, ఆదివారము విద్యాదర్శిని ఐ .ఎ.ఎస్ అకాడమి ప్రాంగణములో ఉదయం 10:00 నుంచి మద్యాహ్నం 2:00 వరకు జరుగుతాయి. తదుపరి మద్యాహ్నం 2:00 నుండి సాయంత్రం 6:00 వరకు ప్రశ్నాపత్రల Explanation అనుభవజ్ఞులైన అధ్యాపకులచే ఇవ్వబడుతుంది అని వివరించారు. ఆసక్తి కలిగిన ఆభ్యర్డులు ఈ సదవకాశమును స్వదినియోగం చేసుకోవాలని కమిషనర్ తెలియచేశారు
Tags vijayawada
Check Also
డిసెంబరు 30 న రాజానగరం ఎంపీడీవో కార్యాలయంలో జాబ్ మేళా
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ మరియు జిల్లా ఉపాధి సంస్థ ఆధ్వర్యంలో తూర్పుగోదావరి …