Breaking News

యం.కె బేగ్ స్కూల్ లో మ‌ధ్యాహ్నం భోజ‌నం చేసిన కమిషనర్ ప్రసన్న వెంకటేష్…

-నాడు నేడు పనుల ద్వారా స్కూల్స్‌ అభివృద్ధి
-ఎమ్మెల్సీ ఎం.డీ కరీమున్నిస్సా తో కలిసి పర్యటించిన కమిషనర్ ప్రసన్న వెంకటేష్ ఐ.ఏ.ఎస్‌

విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త :
పేద బాల బాలికలు పేదరికం కారణంగా పాఠశాలకు వెళ్ళడం మానివేయకూడదనే ఉద్దేశంతో జగనన్న గోరు ముద్ద మధ్యాహ్నం భోజనం ప్ర‌భుత్వం ఉచితంగా అందిస్తుంద‌ని, నాడు నేడు ప‌థ‌కంలో భాగంగా న‌గ‌రంలో ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ది చేస్తామ‌ని న‌గ‌ర పాల‌క సంస్థ క‌మిష‌న‌ర్ ప్ర‌సన్న వెంక‌టేష్ ఐ.ఏ.ఎస్ పేర్కొన్నారు.. బుధ‌వారం ఎమ్మెల్సీ క‌రిమునీస్సా న‌గ‌రపాల‌క సంస్థ అధికారుల‌తో క‌లిసి క‌మిష‌న‌ర్ 59వ డివిన్‌లో ప‌లు ప్రాంతాల‌ను ప‌ర్య‌టించారు. పైపుల రోడ్డులో ర‌హ‌దారిపై వ‌ర్షపు నీరు నిల్వ లేకుండా చ‌ర్య‌లు చేప‌ట్టాలని అధికారుల‌ను అదేశించారు.. సింగ్ న‌గ‌ర్ రైతు జ‌జార్, పాయ‌కాపురం త‌దిత‌ర ప్రాంతాల‌ను ప‌ర్య‌టించిన క‌మిష‌న‌ర్ మాట్లాడుతూ గుజ్జల సరళాదేవి కళ్యాణ మండపం ఆధునీకరణ చేస్తామ‌న్నారు.. ఈ ప్రాంతంలో షాపులు నిర్మాణంపై అంచ‌నాలు రూపాందించాల‌ని, అదే విధంగా రైతు బజారు ప్రధాన ద్వారం నిర్మాణ పనులు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. అనంత‌రం ఎమ్మెల్సీ క‌రిమునీస్సాతో క‌లిసి క‌మిష‌న‌ర్‌ యం.కె బేగ్ నగరపాలక సంస్థ హై స్కూల్ అవ‌ర‌ణ‌లో మ‌ధ్యాహ్నం భోజ‌నం చేశారు.. విద్యార్థుల‌కు ఇస్తున్న భోజ‌నం వివ‌రాలు అడిగి తెలుసుకున్నారు. యం.కె బేగ్ నగరపాలక సంస్థ హై స్కూల్ అవ‌ర‌ణ‌లో నీరు నిల్వ‌లేకుండా చ‌ర్య‌లు చేపట్ట‌డంతో పాటు ఖాళీ స్థ‌లంను చ‌దును చేయాల‌న్నారు. ఎమ్. ఎల్.సీ కరిమున్నిసా మాట్లాడుతూ సీఎం జగన్ మోహన్ రెడ్డి విజ‌య‌వాడ న‌గ‌రంపై ప్ర‌త్యేక శ్ర‌ద్ద‌తో నిధులు కెటాయించ‌డంతో విజయవాడ నగర అభివృద్ధి శ‌ర‌వేగంగా సాగుతుంద‌న్నారు. కార్య‌క్ర‌మంలో 59వ డివిజన్ కార్పొరేటర్ మొహమ్మద్ షహీనా సుల్తానా, 30వ డివిజన్ కార్పొరేటర్ భీమిరెడ్డి శివ వెంకట జానారెడ్డి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వి.శ్రీనివాస్, హెల్త్ ఆఫీసర్ డా.రామకోటేశ్వరరావు, వైసీపీ రాష్ట్ర మైనారిటీ కార్యదర్శి ఎండీ రూహుల్లా, వైసీపీ శ్రేణులు ఉన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

స్వర్ణాంధ్ర , స్వచ్ఛ ధర్మవరం లక్ష్యంగా ముందుకు సాగుదాం.

-ప్రజల భాగస్వామ్యంతో అభివృద్ధి సాధ్యం… -మంత్రి సత్య కుమార్ యాదవ్ ధర్మవరం, నేటి పత్రిక ప్రజావార్త : పరిశుభ్రతతోనే ఆరోగ్యకరమైన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *