-రెండు లక్షల విలువగల 4 ఏసీలను అందజేసిన వెలంపల్లి సాయిఅశ్విత
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కొత్తపేట యాదవ కళ్యాణ మండపం నిర్వాహకుల వినతి మేరకు వెలంపల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు కుమార్తె సాయి అశ్విత బుధవారం యాదవ కళ్యాణ మండపం నిర్వాహకులకు రెండు లక్షల విలువగల 4 ఏసీలను అందజేశారు. కార్యక్రమంలో నగర పాలక సంస్థ కో-ఆప్టెడ్ సభ్యరాలు జమ్ముల పూర్ణమ్మ, పల్లా సూర్యారావు, పల్లా మురళీ, పి.మురళీ కృష్ణ, తంగేల రాము, యదవ్ కల్యాణ మండపం కమిటీ సభ్యులు వంజరపు సూర్యరావు, దేవర సురేష్ బాబు, వెంకట దుర్గరావు, ఎస్. వెంకట రాధకృష్ణ, రమణ, ఒమ్మి ఉషా, నమ్మి భాను ప్రకాష్ తదితరులు ఉన్నారు.