Breaking News

చట్టాలపై పౌరులు కనీస అవగాహన కలిగి ఉండాలి… : ఎమ్మెల్యే మల్లాది విష్ణు 

విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త :
పౌర హక్కులపై ప్రజలు పూర్తి అవగాహన కలిగి ఉన్నప్పుడే సమాజంలో మార్పు వస్తుందని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు  అన్నారు. 61 డివిజన్ శాంతినగర్ లోని 256 వార్డు సచివాలయంలో జరిగిన పౌర హక్కుల దినోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే  మాట్లాడుతూ ప్రతి నెలా చివరి రోజున పౌర హక్కుల దినోత్సవంగా జరుపుకునేందుకు ముఖ్యమంత్రి  వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు జారీ చేయండం జరిగిందన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇవాళ రెండో సమావేశం నిర్వహించుకోవటం సంతోషంగా ఉందని వెల్లడించారు. ప్రజలలో పౌర హక్కుల దినోత్సవంపై మరింత చైతన్యం తెచ్చే విధంగా రానున్న రోజుల్లో సదస్సులు, ర్యాలీలు నిర్వహిస్తామని తెలియజేశారు. గుంటూరులో రమ్య అనే యువతి హత్యోదంతం తీవ్రంగా కలచి వేసిందని మల్లాది విష్ణు అన్నారు. దాడిని ఏ ఒక్కరు ఆపగలిగినా రమ్య ఇవాళ మన మధ్య ఉండి ఉండేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు దిశ వంటి చట్టాలపై ప్రజలకు పూర్తి అవగాహన కల్పిస్తామన్నారు. పౌర హక్కులకు భంగం కలిగిస్తే ఎటువంటి వారిపైన అయినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం రాజ్యాంగంలో పౌరుల హక్కుల ప్రాధాన్యత గురించి ప్రజలకు వివరించారు. కార్యక్రమంలో నార్త్ ఎమ్మార్వో దుర్గాప్రసాద్, A. S. W. O. విజయవాడ అర్బన్ సర్వేశ్వర రావు, ఎస్సై శేషా రెడ్డి, వైఎస్సార్ సీపీ నాయకులు ఉమ్మడి వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *