అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వారి ఆదేశాల మేరకు రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన పలు అంశాలపై చర్చించేందుకు బుధవారం రాష్ట్ర సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ అధ్యక్షతన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం ప్రారంభంమైంది. ఈసమావేశంలో సర్వీసెస్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్.ఎస్.రావత్,వైద్య ఆరోగ్య ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు,రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయలక్ష్మి,టిఆర్ అండ్ బి ముఖ్య కార్యదర్శి కాంతిలాల్ దండే, పిఆర్ అండ్ ఆర్డి ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్,విద్యాశాఖ కార్యదర్శి కె.శశిధర్, వ్యవసాయ శాఖ డైరెక్టర్ ఢిల్లీ రావు, కళాశాల విద్యా డైరెక్టర్ భరత్ గుప్త, ఆర్థిక శాఖ సంయుక్త కార్యదర్శి గౌతమ్ అల్లాడ తదితర అధికారులు పాల్గొన్నారు.
ఈ సమావేశంలో ఉద్యోగ సంఘాల నుండి ఎపి ఎన్జిజిజిఓ,రాష్ట్ర టీచర్స్ యూనియన్,ఎపి ప్రోగ్రస్సివ్ రికగ్నైజడ్ టీచర్స్ యూనియన్,ఎపి యునైటెడ్ టీచర్స్ ఫెడరేషన్,ఎపి టీచర్స్ ఫెడరేషన్,ఎపి రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్,ఎపి గవర్నమెంట్ ఎంప్లాయిస్ అసోసియేషన్,ఎపి ఉపాధ్యాయ సంఘం,ఎపి అన్ని ప్రభుత్వ వాహనాల డ్రైవర్ల సెంట్రల్ అసోసియేషన్, ఆల్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు క్లాస్ 4 ఉద్యోగుల సెంట్రల్ అసోసియేషన్,ఎపి కో ఆపరేటివ్ సర్వీస్ అసోసియేషన్,ఎపి స్టేట్ గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ (ప్రత్యేక ఆహ్వానితులు),ది స్టేట్ గవర్నమెంట్ సెన్సర్స్ అసోసియేషన్ ఎపి (ప్రత్యేక ఆహ్వానితులు) అధ్యక్షత, జనరల్ సెక్రటరీలు మరియు ఎపి సెక్రటేరియట్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీహాజరయ్యారు.
Prajavartha Online Telugu News