Breaking News

ఈక్రాప్ – పంటలనమోదు ప్రస్తుత అత్యంత ప్రాధాన్యత అంశము… : డిల్లీ రావు ఐఏఎస్

-సెప్టెంబర్ 30 నాటికి ఈ – పంట లో అన్ని రకాల పంటల నమోదును పూర్తి చేయాలి – అధికారులకు ఆదేశించిన వ్యవసాయ సంచాలకులు
-గ్రామ రైతు సేవా కేంద్ర సిబ్బంది రోజుకు కనీసం 50 ల్యాండ్ పార్సిల్ లను నమోదు చెయ్యాలి 

విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త :
శనివారంరాష్ట్రములోని అన్ని జిల్లాల వ్యవసాయ ,ఉద్యాన ,పట్టు శాఖ ల లోని మండల స్థాయి అధికారుల వరకు ఈ- పంట లో పంటసాగు నమోదు పై శనివారం టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష జరిపారు. నమోదు ప్రక్రియ చాలా మంద గమనంతో తక్కువగా పరిమాణంలో ఉన్నదని ,ఖరీఫ్ సీజన్ సెప్టెంబర్ 30 తో ముగుస్తున్న కారణముగా అధికారులందరూ ఈ పంట నమోదును అత్యంత ప్రాధాన్యత అంశముగా పరిగణించి , సెప్టెంబర్ 30 లోపు ఈ పంట నమోదును పూర్తి చేయాలని ఆదేశించారు. కేంద్ర రాష్ట్ర వ్యవసాయ సంబంధిత రంగాల ఆర్థిక,సంక్షేమ మరియు అభివృద్ధి పథకాలకు సమాచార సేకరణకు మూలం- ఈ – పంట లోని పంటల నమోదు వివరాలు అని , వీటి సమాచార డేటా అత్యంత కీలకంగా ఉన్నాయని తెలిపారు. 2కోట్ల61 లక్షల ల్యాండ్ పార్సిల్ -భూ భాగములకు 26107419 గాను కేవలం 8 శాతం మేర మాత్రమే 21,07,422 ల్యాండ్ పార్సిల్ లో మాత్రమే ఈ పంట నమోదు చేశారని ,ఇకనుండి మరింత వేగంగా స్పందించి సెప్టెంబర్ 30 లోపు పూర్తి చేయాలని ఆదేశించారు. ఈక్రాప్ నమోదులో తక్కువ పురోగతి ప్రదర్శించిన, జిల్లాలను సహాయ వ్యవసాయ అధికారులను ,వ్యవసాయ అధికారులను సమీక్షించారు. వ్యవసాయేతర మరియు బీడు భూభాగాలను కూడా నమోదు చేయాలి. ల్యాండ్ పార్సిల్ – భూ భాగాలను 89 శాతం డౌన్ లోడ్ చేయటం జరిగిందని మిగిలిన 11 శాతం డౌన్ లోడ్ పూర్తి చేయాలని ఆదేశించారు. ఏలూరు జిల్లాలో ఆక్వా సాగు , కొన్ని జిల్లాలలో రెవెన్యూ సమస్యలు లేదా రైతు సేవా కేంద్రం / పట్టణ కేంద్రాలకు సిబ్బందిని కేటాయించకపోవటం తదితర అంశాలను గుర్తించామని తెలిపారు. ఉద్యాన శాఖ సంచాలకులు K శ్రీనివాసులు ఐఏయస్ మాట్లాడుతూ ఉద్యాన పంటల 40 లక్షల ఎకరాల విస్తీర్ణంనకు కేవలం 6 లక్షల ఎకరాల విస్తీర్ణంనకు మాత్రమే ఇప్పటివరకు ఈ క్రాప్ నమోదు చేశారని ,పురోగతిని చూపాలని ,ఇకనుండి వారం వారం సమీక్షలు జరుపుతామని తెలిపారు. చివరగా డిల్లీ రావు ఈ పంట డేటా పాలనా పరంగా ప్రాధాన్యతను ,ఎదురవుతున్న సవాలును వివరిస్తూ , ఈ మధ్య కాలంలో కర్నూలు జిల్లా లో ఉల్లి ధరల విషయం, చిత్తూరు జిల్లాలో మామిడి – తోటాపురి ,ప్రకాశం జిల్లాలో బర్లీ పొగాకు ధర విషయంలో ,గత వారం లో కురిసిన బారీ వర్షాలకు పంటనష్టం అంచనాకు ఈ పంట డేటా సమాచారం అత్యంత అవసరంగా నిలిచిందని తెలిపారు. కడప ,ఏలూరు, అనకాపల్లి జిల్లా వ్యవసాయ అధికారులు, ఉద్యాన అదనపు సంచాలకులు చర్చలో పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ముఖ్య‌మంత్రి ప‌ర్య‌ట‌న‌కు శ‌ర‌వేగంగా ఏర్పాట్లు

– కార్య‌క్ర‌మం విజ‌య‌వంతానికి అధికారులు స‌మ‌ష్టిగా కృషిచేయాలి – జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌, ఎమ్మెల్యే కొలిక‌పూడి శ్రీనివాస‌రావు విజయవాడ, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *