అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
విద్యాశాఖలో నాడు–నేడుతో పాటు పౌండేషన్ స్కూళ్లుపై రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి క్యాంప్ కార్యాలయంలో మంగళవారం సమీక్షించారు. ఈ సమీక్షా సమావేశంలో సీఎం వైయస్ జగన్ మాట్లాడుతూ నూతన విద్యావిధానం అమలుపై అన్నిరకాలుగా సిద్ధంకావాలని, ఆ దిశగా అడుగులు ముందుకేయాలని సీఎం ఆదేశించారు. పాఠ్యపుస్తకాల ముద్రణ నాణ్యతను పెంచాలి: అధికారులకు సీఎం ఆదేశించారు. కనీసం మూడో తరగతి నుంచి సబ్జెక్టుల వారీగా టీచర్లు ఉండేలా చర్యలు తీసుకోవాలని సీఎం అన్నారు. సీబీఎస్‌ఈ అఫిలియేషన్‌పైనా సీఎంకు వివరాలు అధికారులు అందించారు. ముందుగా వేయి స్కూళ్లను అఫిలియేషన్ చేస్తున్నామని అధికారులు అన్నారు. అన్నిరకాల స్కూళ్లు సీబీఎస్‌ఈ అఫిలియేషన్ ఉండేలా చర్యలు తీసుకోవాలని సీఎం అన్నారు. ఐసీఎస్‌ఈ అఫిలియేషన్‌మీద కూడా దృష్టిపెట్టాలని ముఖ్యమంత్రి అన్నారు. నాడు – నేడు కింద రెండో విడతలో 12,663 స్కూళ్లు, రూ. 4535.74 కోట్ల ఖర్చుకు ప్రణాళికలు, 18,498 అదనపు తరగతి గదులు, మూడో విడతలో నాడు–నేడు కింద 24,900 స్కూళ్లు, దీనికోసం రూ.7821 కోట్ల ఖర్చు అంచనా, రెండో దఫా నాడు– నేడుకు సంబంధించి టెండర్ల ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని సీఎం ఆదేశించారు.
నాడు – నేడు పనులకు సంబంధించి సచివాలయంలో ఇంజినీర్లకు శిక్షణ:
సుమారు 12వేల మందికి శిక్షణ అందించినున్న అధికారులు
అనంతరం పేరెంట్స్ కమిటీలకు శిక్షణ ఇవ్వనున్నట్టు తెలిపిన అధికారులు
స్కూళ్ల నిర్వహణ, టాయిలెట్ల నిర్వహణలపై ప్రత్యేక శ్రద్ద చూపించాలన్న సీఎం
నాడు నేడు కార్యక్రమం ద్వారా ఇంత డబ్బు ఖర్చుపెట్టిన తర్వాత కచ్చితంగా స్కూళ్ల నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్న సీఎం
లేకపోతే మళ్లీ పూర్వపు స్థితికి వెళ్లిపోతాయన్న సీఎం
స్కూళ్లలో ఎలాంటి మరమ్మతులు వచ్చినా, ఏదైనా సమస్యలు వచ్చినా వెంటనే చేయించడానికి కంటిజెన్సీ ఫండ్ ఒకటి ప్రతి స్కూల్లో ఉంచాలన్న సీఎం
దీనిపై ఎస్‌ఓపీలను తయారు చేయాలన్న సీఎం
అప్పుడే స్కూళ్లు నిత్యనూతనంగా ఉంటాయిన్న సీఎం
జగనన్న విద్యాకానుకపై సీఎం వైయస్.జగన్ సమీక్ష
ఈ యేడాది విద్యాకానుక కింద నూటికి నూరుశాతం పంపిణీ పూర్తయిందని తెలిపిన అధికారులు
కోవిడ్ పరిస్థితులు తగ్గుముఖం పడుతున్నందున వచ్చే ఏడాది పిల్లలు స్కూల్‌కు వెళ్లేనాటికే విద్యాకానుక అందించాలన్న సీఎం
వచ్చే ఏడాది విద్యా కానుక కింద ఇవ్వనున్న వస్తువులపై సీఎంకు వివరాలు అందించిన అధికారులు
విద్యాకానుక కింద ఇచ్చే వస్తువులు నాణ్యతగా ఉండాలని స్పష్టంచేసిన సీఎం
వచ్చే ఏడాది నుంచి విద్యాకానుకలో భాగంగా స్పోర్ట్స్ షూ, స్పోర్ట్స్ డ్రస్
మంచి డిజైన్, నాణ్యత ఉండేలా చూడాలన్న సీఎం
స్వేచ్ఛ కార్యక్రమం కింద స్కూల్లో ఆడపిల్లలకు శానిటరీ నాప్‌కిన్స్ పంపిణీ కార్యక్రమం
అక్టోబరు మధ్యంతరంలో కార్యక్రమం ప్రారంభానికి సన్నహాలు చేస్తున్నామన్న అధికారులు
ఈ సమీక్షా సమావేశాంలో పాఠశాల విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి తానేటి వనిత, పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుడితి రాజశేఖర్, మహిళా, శిశు సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి ఏ ఆర్ అనురాధ, ఆర్ధికశాఖ కార్యదర్శి ఎన్ గుల్జార్, పాఠశాల విద్యాశాఖ కమిషనర్ వాడ్రేవు చినవీరభద్రుడు, సర్వ శిక్షా అభయాన్ స్టేట్ ప్రోజెక్టు డైరెక్టర్ వెట్రిసెల్వి, పాఠశాల విద్యాశాఖ సలహాదారు ఏ మురళీ, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ (ఎస్‌సీఈఆర్‌టీ) బి ప్రతాప్ రెడ్డి ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.