-శాసనసభ్యులు దూలం నాగేశ్వరరావు
కలిదిండి, నేటి పత్రిక ప్రజావార్త :
కొండంగి-1 మరియు కొండంగి-2 ఎత్తిపోతల స్కీం లకు సంబంధించి సంబందిత గ్రామాల రైతులతో రెండు కమిటీలు వేయాలని శాసనసభ్యులు దూలం నాగేశ్వరరావు అధికారులు తన దృష్టికి తేవడం జరిగిందని తెలిపారు. బుధవారం కలిదిండి లో శాసననసభ్యులు దూలం నాగేశ్వరరావును కలసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నీటిపారుదల అభివృద్ధి సంస్థ అధికారులతో కొండంగి ఎత్తిపోతల పథకం పనులపై చర్చించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కొండంగి-1 మరియు కొండంగి-2 ఎత్తిపోతల స్కీం లకు సంబంధించి సంబందిత గ్రామాల రైతులతో రెండు కమిటీలు వేయాలని అధికారులు తన దృష్టికి తేవడం జరిగిందన్నారు. కేచ్ మెంట్ ఏరియా గ్రామాల నుండి గ్రామానికి ఇద్దరు రైతుల చొప్పున ఎంపిక చేసి వెంటనే కమిటీలు వేయడం జరుగుతుందని ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమంలో ఏపీఎస్ ఐడీసి ఏజీపి కె. సతీష్,ఏఈ ఎమ్ ఎస్ఆర్ ప్రసాద్, టీఏఏకె రాజు, స్థానిక నాయకులు చందన ఉమామహేశ్వరరావు, పడవల శ్రీను,వడుపురామారావు,నీలి సుమన్,ఛాన్ బాషా,నీలి సుమన్, ఊర శ్రీధర్,చాంద్ బాషా,సానా రాము,చిట్టూరి వాసు,గోదావరి సత్యనారాయణ, పోసిన కొండ,కందుల వెంకటేశ్వర రావు,తట్టుకోళ్ల నాంచారయ్య, ముత్తిరెడ్డి సత్యనారాయణ, పోసిన రాజీవ్ భారత్,పేటేటి వివేకానంద, అనపర్తి వడ్డీకాసులు,గుడివాడ ఫణి, తదితరులు పాల్గొన్నారు.