నూజివీడు, నేటి పత్రిక ప్రజావార్త :
అంగన్ వాడి కేంద్రాలను ప్రీ స్కూల్స్ గా తీర్చిదిద్దుతున్నట్లు శాసనసభ్యులు మేకా వెంకట ప్రతాప్ అప్పారావు అన్నారు. నూజివీడు మండలం అన్నవరం గ్రామం లో 22.40 లక్షల రూపాయలతో నిర్మించిన రెండు అంగన్వాడీ ప్రీ ప్రైమరీ స్కూల్స్ ను ఎమ్మెల్యే శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రతాప్ అప్పారావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నాడని, అంగన్వాడీ కేంద్రాల ద్వారా మహిళలు, పిల్లలకు పౌష్టికాహారం అందించడం తో పాటు పిల్లలకు ప్రీ స్కూల్ విధానంలో విద్య అందించడం జరుగుతుందన్నారు. అంగన్వాడీ సెంటర్ పరిధిలో పౌష్టికాహార లోపం కలిగిన గర్భిణీలు, బాలింతలను గుర్తించి వారికి పూర్తి స్థాయి పౌష్టిహారం వారి ఇంటికే అందించడం జరుగుతుందన్నారు. మూడు సంవత్సరాలు దాటిన పిల్లలకు పాలు , గుడ్లు వంటి పౌష్టికాహారంతో పాటు, ప్రాధమికంగా ఇంగ్లీష్ మాధ్యమంతో విద్య అందించడం జరుగుతుందన్నారు. అన్నవరం, పోతిరెడ్డిపల్లి, యల్లమంద, తుక్కులూరు గ్రామాలలో నిర్మిస్తున్న గ్రామ సచివాలయ భవనాలు, రైతు భరోసా కేంద్రాల, గ్రామ వెల్నెస్ సెంటర్ల నిర్మాణ పనులు వేగవంతం చేయాలనీ అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు.
అన్నవరం పరిసరాలు అభివృద్ధికి కృషి : ఎమ్మెల్యే ప్రతాప్ అప్పారావు
అన్నవరం గ్రామంతో పాటు పరిసర గ్రామాలైన పోతిరెడ్డిపల్లి, ఎలమంద, తుక్కులూరు గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు చెప్పారు. ఈ ప్రాంతాలలో రోడ్లు మరమ్మత్తు వెంటనే చేపట్టాలని అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. ఆయా గ్రామాలలో అర్హులైన ప్రతీ ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పధకాలు అందజేస్తామన్నారు. ప్రజలు తమ సమస్యలను దగ్గరలోని సచివాలయాలలో తెలియజేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నూజివీడు ప్రాంతానికి 250 కోట్ల రూపాయలతో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ను మంజూరు చేసిందని, దీంతో ఈ ప్రాంతంలోని మామిడి పంటకు మంచి ధర రావడంతో పాటు, అన్నివిధాలుగా అభివృద్ధి చెందుతుందని, నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కూడా కలుగుతాయన్నారు. కార్యక్రమంలో సిడిపిఓ వై. జయలక్ష్మి, మునిసిపల్ కౌన్సిలర్ శీలం రాము, పంచాయతీరాజ్ డి ఈ రఘురామ్ , సర్పంచ్ మెలుగుమాటి శ్రీలక్ష్మి, ప్రభృతులు పాల్గొన్నారు. అనంతరం మహిళలకు పౌష్టికాహారం కిట్లను ఎమ్మెల్యే పంపిణి చేసారు.
Tags nuzividu
Check Also
దాడి పూర్ణిమను ఆశీర్వదించిన ఎమ్మెల్యే సుజనా చౌదరి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్ దాడి అప్పారావు మనవరాలు, తెలుగు యువత నాయకులు …