Breaking News

గ్రామోద్యోగ్ వికాస్ యోజన కింద ఎలక్ట్రిక్ కుండల తయారి చక్రాలు ఉపయోగించడం పై శిక్షణ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఖాదీ మరియు గ్రామీణ పరిశ్రమల  కమిషన్ రాష్ట్ర కార్యాలయం, విజయవాడ,రాష్ట్ర సంచాలకులు డాక్టర్ ఎస్. గ్రిప్,ఆధ్వర్యంలో గ్రామోద్యోగ్ వికాస్ యోజన కింద ఎలక్ట్రిక్ కుండల తయారి చక్రాలు ఉపయోగించడం పై శిక్షణా తరగతులు సిరి వేల్పూర్ గ్రామం, గుడివాడ మండలం, కృష్ణాజిల్లా నందు ప్రారంభించడం జరిగింది.ఈ శిక్షణా తరగతులు 07.10.2025 తేదీ నుండి 16.10.2025 తేదీ వరకు నిర్వహించుచున్నారు.ఈ శిక్షణ కార్యక్రమంలో 20 మంది వరకు శిక్షణ పొందుటకు ఏర్పాటు చేయడమైనది. అదేవిధంగా ఈ శిక్షణ ప్రారంభ సమయంలో 40 నుంచి 50 మంది వరకు పాల్గొనటం జరిగింది.ఈ కార్యక్రమానికి (కే వి ఐ సి)రాష్ట్ర సంచాలకులు విజయవాడ,డా. ఎస్. గ్రీప్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఎస్.గ్రిప్ రాష్ట్ర సంచాలకులు,ఖాదీ మరియు గ్రామీణ పరిశ్రమల  కమిషన్, రాష్ట్రకార్యాలయం, విజయవాడ.ఎం. ప్రభాకర రావు,సిరి వేల్పూరు గ్రామ పంచాయతీ అధ్యక్షులు.
శ్రీమతి అర్చన,సిరి వేల్పూర్ గ్రామ పంచాయతీ కార్యదర్శి, ఆర్. ఎల్. ఎన్. మూర్తి, అసిస్టెంట్ డైరెక్టర్-II, ఎస్ ఓ, ( కే వి ఐ సి) విజయవాడ పాల్గొన్నారు. ఆశిష్ కుమార్ చౌదరి,ఎగ్జిక్యూటివ్, కేవిఐసి, విజయవాడ పాపయ్య, మాస్టర్ ట్రైనర్.
వంశీ,శాలీవాహన సంఘంలోని వ్యక్తి డాక్టర్ ఎస్. గ్రిప్ రాష్ట్ర సంచాలకులు, ఖాదీ మరియు గ్రామీణ పరిశ్రమల కమిషన్,రాష్ట్రకార్యాలయం, విజయవాడ మాట్లాడుతూ ఈ శిక్షణా తరగతులు ఉద్దేశం కుమ్మరులకు ఆధునిక ఎలక్ట్రిక్ కుమ్మరి చక్రాలు శిక్షణ ఇవ్వడం,తద్వారా గ్రామీణ ప్రాంతాలలో అధునాతన పనిముట్లతో వారి ఉత్పాదకతను మెరుగుపరచడం.ఈ శిక్షణా తరగతుల ద్వారా  ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడానికి ఎలక్ట్రిక్ కుమ్మరి చక్రాలను ఉపయోగించడంపై ఆచరణాత్మక మరియు సిద్ధాంతపరమైన పరిజ్ఞానం పెంచడం ముఖ్య ఉద్దేశం అని తెలియపరిచారు. ఎం.ప్రభాకర రావు,సిరి వేల్పూరు గ్రామ పంచాయతీ అధ్యక్షులు, మాట్లాడుతూ,అభ్యర్థులు ఈ పది రోజుల శిక్షణా తరగతుల్లో పాల్గొని ఆధునిక పరికరాల వినియోగాన్ని తెలుసుకొని తద్వారా కుటుంబ ఆదాయాన్ని పెంచుకోవడం అదేవిధంగా తమ ఉత్పత్తుల ద్వారా గణపవరం గ్రామం యొక్క ఖ్యాతిని పెంచాలని తెలియపరిచారు. అర్చన, సిరి వేల్పూర్ గ్రామ పంచాయతీ కార్యదర్శి, మాట్లాడుతూ,ఈ పది రోజుల శిక్షణా తరగతులు వినియోగం చేసుకుని ఆధునిక పద్ధతులు ద్వారా ఉత్పత్తి ఏ విధంగా పెంచుకోవాలి ఆధునిక యంత్రాలను ఏ విధంగా ఉపయోగించాలి తెలుసుకుని తమ యొక్క ఆదాయాన్ని పెంచుకోవాలని సూచించారు. ఆర్. ఎల్. ఎన్. మూర్తి,అసిస్టెంట్ డైరెక్టర్-II, ఎస్ ఓ, (కే వి ఐ సి) ,విజయవాడ, మాట్లాడుతూ , (కే వి ఐ సి) గ్రామోద్యోగ్ వికాస్ యోజన కింద సాంప్రదాయ గ్రామీణ చేతివృత్తుల వారిని గుర్తించి  వివిధ రకాలైన చేతివృత్తులలో ఆదాయాన్ని పెంచుటకు మరియు ఆధునిక పద్ధతులను ఉపయోగించడంలో శిక్షణ ఇవ్వడం జరుగుచున్నది. గ్రామోద్యోగ్ వికాస్ యోజన కార్యక్రమం వల్ల, చేతివృత్తులవారు తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి మరియు ఎక్కువ ఆదాయం మరియు తక్కువ శ్రమను పొందడం కొరకు మెరుగైన టూల్స్ /ఎక్విప్ మెంట్ పై పనిచేయుట ద్వారా ప్రయోజనం పొందుతారు. అదేవిధంగా శిక్షణ పొందిన వారందరికీ మెరుగైన టూల్స్ ఎక్విప్మెంట్ కూడా అందజేయడం జరుగుచున్నదని తెలియచేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

పెనుగంచిప్రోలులో మజ్జిగ పంపిణీ కార్యక్రమం

పెనుగంచిప్రోలు, నేటి పత్రిక ప్రజావార్త : పెనుగంచిప్రోలు మండలంలో కృష్ణా జిల్లా సహకార కేంద్ర బ్యాంకు లిమిటెడ్, పెనుగంచిప్రోలు బ్రాంచ్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *