-పార్కులతో నగర ప్రజలకు ఆక్సిజన్
-72 లక్షల రూపాయలతో అభివృద్ధి పరచిన పార్క్ ల ప్రారంభం
-దేవదాయ దర్మధాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగరంలో పచ్చదనంతో పాటుగా ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణo అందించాలనే లక్ష్యంగా పార్క్ ల నిర్మాణం చేపట్టిన్నట్లు దేవదాయ దర్మధాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు తెలిపారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో 44 డివిజన్ లేబర్ కాలనీలో రూ.16.00 లక్షల అంచనా వ్యయంతో అభివృద్ధి చేసిన పార్క్ ను, 43వ డివిజను ఊర్మిళ సుబ్బారావు నగర్ లో రూ.56.08 లక్షలతో నిర్మించిన పార్క్ ను నగర మేయర్, కమిషనర్, స్థానిక కార్పోరేటర్లతో కలిసి మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు ప్రారంభోత్సవం చేశారు. తెలుగుదేశం ప్రభుత్వ హయంలో విజయవాడ నగరాభివృద్దికి నిధులు కూడా కెటాయించలేదని, ప్రచారంతో పాలన సాగించారన్నారు. సీఎం జగన్ మెహన్‌రెడ్డి హయంలో దాదాపు 600 కోట్లు రూపాయలతో అభివృద్ది పనులు జరుగుతున్నాయన్నారు. అందులో రోడ్లు, డ్రేనేజీ, పార్క్ ల అభివృద్ది పనులు జరుగుతున్నాయన్నారు. అనంతరం పార్క్ ఆవరణంలో మంత్రి మొక్కలు నాటారు.
పార్క్ ల అభివృద్ధి తో స్థానికులకు ఆహ్లాదం – మేయర్ రాయన భాగ్యలక్ష్మి
నగరంలోని పార్కును మరింత అందంగా, ఆకర్షణీయంగా తీర్చిదిద్దనున్నట్లు నగర పాలక సంస్థ మేయర్ రాయన భాగ్యలక్ష్మి పేర్కొన్నారు. పార్క్ లలో ఓపేన్ జిమ్, చిన్నారులకు ఆటపరికరాలు, వాకింగ్ ట్రాక్ మొదలగు వాటిని ఏర్పాటు చేసిన్నట్లు వివరించారు. జగనన్న హయంలో నగరం అభివృద్ది దిశగా పరుగులు తీసుతుందన్నారు. విజయవాడను మోడల్ నగరంగా అభివృద్ది చేస్తామన్నారు.
కార్యక్రమంలో నగర పాలక సంస్థ కమిషనర్ ప్రసన్న వెంకటేష్ ఐ.ఏ.ఎస్, డిప్యూటి మేయర్లు బెల్లందుర్గ, ఆవుతు శ్రీశైలజారెడ్డి, కార్పొరేటర్లు బాపతి కొటిరెడ్డి, మైలవరపు రత్నకుమారి, చైతన్య రెడ్డి, ఇర్పాన్, అంజనేయ రెడ్డి, గుడివాడ నరేంద్ర, షేక్ రేహమతున్నీసా, నగర పాలక సంస్థ అధికారులు చీఫ్ ఇంజనీర్ యం.ప్రభాకరరావు, ఎస్.ఇ పి.వీ.కె భాస్కరరావు, ఏ,డి,హెచ్ జె.జ్యోతి మరియు వైసీపీ శ్రేణులు ఉన్నారు.