Breaking News

పౌష్టికాహార మాసోత్సవాలను గర్భిణులు, బాలింతలు, చిన్నారులు సద్వినియోగం చేసుకోవాలి : ఎమ్మెల్యే మల్లాది విష్ణు

-మహిళలలో ధైర్యాన్ని నింపిన దిశ యాప్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పోషక విలువలున్న ఆహారంతో చక్కని ఆరోగ్యం సిద్ధిస్తుందని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పౌష్టికాహార మాసోత్సవం కార్యక్రమాన్ని అరండల్ పేటలోని ఉర్దూ స్కూల్ నందు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ బంకా శకుంతల భాస్కర్ తో కలిసి శాసనసభ్యులు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా ఐసిడిఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పౌష్టికాహార పదార్ధాల స్టాల్స్ ను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా గర్బిణీలు, బాలింతలు, చిన్నారులకు వైఎస్సార్ సంపూర్ణ పోషకాహార కిట్లను పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే  మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో 55,607 అంగన్‌వాడీ కేంద్రాల్లోని లబ్ధిదారుల్లో రక్తహీనత, పోషకాహార లోపాన్ని నివారించడానికి వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ, వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ ప్లస్‌ పథకాలను ప్రభుత్వం అమలు చేస్తోందని మల్లాది విష్ణు  గుర్తు చేశారు. మాసోత్సవం సందర్భంగా రోజుకో అంశం చొప్పున 30 రోజులు 30 అంశాలపై అవగాహన కల్పించడం అభినందనీయమన్నారు. పోషకాహర మాసోత్సవాలలో భాగంగా సెంట్రల్ నియోజకవర్గంలో 14 వేల మంది బాలింతలు, గర్భిణీలకు సంపూర్ణ పౌష్టికాహారాన్ని అందజేస్తున్నట్లు వెల్లడించారు. ఇందుకోసం నెలకు దాదాపు రూ. 67 లక్షలు రాష్ట్ర ప్రభుత్వం వెచ్చిస్తునట్లు తెలియజేశారు. ఈ సేవలను మరింత పారదర్శకంగా నిర్వహించేందుకు.. వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ యాప్‌ సహా పలు యాప్ లను అందుబాటులోకి తీసుకురావడం జరిగిందన్నారు. మరోవైపు మహిళల భద్రత కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ‘దిశ యాప్’ సత్ఫలితాలను ఇస్తోందని మల్లాది విష్ణు గారు అన్నారు. ఈ యాప్ సాయంతో ఇటీవల సింగ్ నగర్ లో ఒక మహిళ ప్రాణాలను కాపాడినట్లు తెలియజేశారు. కావున ప్రతిఒక్కరూ దిశ యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవలసిందిగా సూచించారు. నియోజకవర్గంలో ఇప్పటివరకు దాదాపు 80 వేల మంది మహిళలు, యువతులు ఈ యాప్ ను డౌన్ లోడ్ చేసుకున్నారని పేర్కొన్నారు. సచివాలయ సిబ్బంది గడపగడపకు వెళ్లి ఈ యాప్ పై ప్రజలకు మరింత విస్తృత అవగాహన కల్పించవలసిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో ఐ.సి.డి.ఎస్ ప్రాజెక్ట్ డైరక్టర్ కె.ఉమారాణి, ఐ.సి.డి.ఎస్ ప్రాజెక్ట్ విజయవాడ-2 సిడిపీఓ జి.మంగమ్మ, సూపర్ వైజర్లు రోజారాణి, రెహనా బేగం, సరిత, శ్రీదేవి, దిశ – 1 స్టాప్ సెంటర్ అడ్మినిస్ట్రేటర్ విద్యాస్రవంతి, వైఎస్సార్ సీపీ నాయకులు ఆలీ, నజీర్, పుల్లయ్య, నాగేశ్వరరెడ్డి, నరేంద్ర, చినబాబు, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Check Also

దాడి పూర్ణిమను ఆశీర్వదించిన ఎమ్మెల్యే సుజనా చౌదరి

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్ దాడి అప్పారావు మనవరాలు, తెలుగు యువత నాయకులు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *