Breaking News

కార్తీక మాసంలో భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు

-కమిషనర్ రాహుల్ మీనా
-పుష్కర ఘాట్ లో ఏర్పాట్ల పరిశీలన

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
కార్తీక మాసం నేపథ్యంలో గోదావరి స్నానాలు ఆచరించేందుకు వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నట్లు కమిషనర్ రాహుల్ మీనా తెలిపారు. ఈ మేరకు ఆదివారం సాయంత్రం పుష్కర ఘాట్ లో ఏర్పాట్లను పరిశీలించారు. భక్తుల రద్దీకి తగినట్లు ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేసి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు. లైటింగ్, సీసీ కెమెరాలు, త్రాగునీరు, స్నానపు గదులు, దుస్తులు మార్చుకొను గదులు, లాకర్లను పరిశీలించారు. పబ్లిక్ అడ్రస్సింగ్ సిస్టంతో పాటు స్విమ్మర్లను, పడవలను సరిపడా అందుబాటులో ఉంచాలని అధికారులకు సూచించారు. ఘాట్ వెంబడి నది ఒడ్డున ఇసుక వేయించాలని.. అలాగే పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించారు. కార్తీక మాస దీపోత్సవ వేడుకలలో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకూడదని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఆయన వెంట ఎంహెచ్ఓ వినూత్న, ఎస్ఈ(ఇంఛార్జి) రీటా, ఈఈ మాధవి, డీఈ సత్యనారాయణ, ఏఈలు వెంకటేష్, ఆంజనేయులు ఉన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

శ్రీ కృష్ణాష్టమి వేడుకలలో దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈ రోజు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా తూర్పు నియోజకవర్గంలో వైస్సార్ కాంగ్రెస్ పార్టీ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *