-వచ్చే వారం నాటికి కనీసం 30 శాతం ఇళ్ల నిర్మాణాలు ప్రారంభo కావాలి..
-ప్రతి మండలంలో వచ్చే వారం నాటికి కనీసం 500 ఇళ్ల నిర్మాణలు చేపట్టేలా చర్యలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జగనన్న ఇళ్ల గ్రౌండింగ్ వారం వారం లక్ష్య సాధన తో మంచి పురోగతి సాధించే దిశగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ జె. నివాస్ అధికార్లను ఆదేశించారు. ప్రతి మండలంలో వచ్చే వారం నాటికి కనీసం 500 ఇళ్ళు చొప్పున నిర్మాణాలు చేపట్టేలా చర్యలు తీసుకోవాలన్నారు. స్థానిక కలెక్టర్ క్యాంప్ కార్యాలయం నుండి గురువారం సాయంత్రం మైలవరం, పెడన నియోజకవర్గాలలో జగనన్న ఇళ్ల నిర్మాణ ప్రగతిని మండల స్థాయి అధికార్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ నివాస్ మాట్లాడుతూ అందుకు అవసరమైన సిమెంట్,ఇసుక,స్టీల్ నిర్మాణ సామగ్రి సిద్ధం చేయాలన్నారు.ప్రతి గ్రామ/వార్డ్ సెక్రటరీలు కనీసం 5 గృహాలు నిర్మాణ పనులు ప్రారంభించే బాధ్యత తీసుకోవాలి,ఇందుకు సంబంధిత వాలంటీర్ల సహకారం తీసుకోవాలన్నారు. జిల్లాలో జగనన్న ఇళ్ల నిర్మాణలకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి లబ్ధిదారులు త్వరితగతిన ఇళ్లు నిర్మించుకునేందుకు ముందుకు వచ్చేలా చైతన్య పరచాలన్నారు. జగనన్న ఇళ్ల నిర్మాణంలో లబ్ధిదారులు ఎటువంటి ఇబ్బందులు పడకుండా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. జగనన్న ఇళ్ల లబ్దిదారులకు రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా ఇసుక, సబ్సిడీ పై సిమెంట్, ఐరన్ అందిస్తున్నదని, డ్వాక్రా మహిళలకు అదనపు ఆర్ధిక సహాయంగా బ్యాంకుల నుండి రుణాలను కూడా అందిస్తున్నామన్నారు. జగనన్న ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలను లబ్దిదారులకు తెలియజేసి, వారు సద్వినియోగం చేసుకునేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.మైలవరం నియోజకవర్గంలో ఇళ్ల నిర్మాణానికి 970 మెట్రిక్ టన్నుల సిమెంట్,132.71 మెట్రిక్ టన్నుల స్టీల్ అందుబాటులో ఉంచమన్నారు.పెడన నియోజకవర్గంలో 1215 మెట్రిక్ టన్నుల సిమెంట్,178.445 మెట్రిక్ టన్నుల స్టీల్ అందుబాటులో ఉన్నాయన్నారు. ఇళ్ల నిర్మాణ సమయంలో నీటి సౌకర్యం అవసరమని, కాలనీలో ఇళ్ల సంఖ్యాననుసరించి అవసరమైన నీటి సౌకర్యం కల్పించేందుకు అధికారులు అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. జగనన్న ఇళ్ల కాలనీలలో విద్యుత్, తాగునీరు, రోడ్లు వంటి మౌలిక సదుపాయాలు పూర్తిస్థాయిలో కల్పించేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఇళ్ల నిర్మాణంలో లబ్ధిదారులకు ఎదురయ్యే సమస్యలను గృహనిర్మాణ శాఖ అధికారుల దృష్టికి తీసుకువచ్చినట్లైతే వెంటనే పరిష్కరిస్తారని, ఈ విషయంపై లబ్దిదారులకు అవగాహన కలిగించాలన్నారు. ఈ రెండు నియోజకవర్గాల్లోని మైలవరం, జి.కొండూరు, ఇబ్రహీంపట్నం, విజయవాడ రూరల్, పెడన,బంటుమిల్లి,గూడూరు,కృతివెన్ను మండలాల్లో ని గ్రామాల వారి గృహ నిర్మాణ లపై కలెక్టర్ సమీక్షించారు. వీడియో కాన్ఫరెన్స్ లో జాయింట్ కలెక్టర్ (గృహ నిర్మాణం ) శ్రీమతి నుపూర్ శ్రీనివాస్ అజయ్ కుమార్, గృహ నిర్మాణ శాఖ పి .డి రామచంద్రన్, తహసీల్దార్లు, ఎంపిడిఓలు, గృహనిర్మాణ శాఖ అధికారులు, ఇంజినీర్లు, ప్రభృతులు పాల్గొన్నారు.