Breaking News

జిల్లాలో నవరత్నాలు – పేదలందరికీ ఇళ్లు లబ్దిదారులు గృహ నిర్మాణాలను వేగవంతంగా పూర్తి చేసేలా కృషి ..

– వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గృహనిర్మాణాల పురోగతిపై నియోజకవర్గ స్థాయిలో సమీక్షలు…
-గతంలో మాదిరి 5 దశల్లో కాకుండా 3 దశల్లోనే ఇళ్లు నిర్మాణపు పేమెంట్ల చెల్లింపు…
-గ్రూపులు గా ఏర్పడిన లబ్దిదారులకు మెటీరియల్ కొనుగోలులో సుమారు రూ.35 వేల వరకు ఆదా అవుతుంది…
-ఇళ్ల నిర్మాణంలో గ్రామ సర్పంచ్ లు, కార్పోరేటర్లు, స్థానిక ప్రజా ప్రతినిధులు సమన్వయంతో పురోగతి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో నవరత్నాలు – పేదలందరికీ ఇళ్లు కింద లబ్దిదారులు గృహ నిర్మాణాలను వేగవంతంగా పూర్తి చేసేలా జిల్లా కలెక్టరు జె. నివాస్ కృషి చేస్తున్నారు. జిల్లాలో గృహ నిర్మాణాల పురోగతి ఇప్పటి వరకు 7 నియోజకవర్గాల్లో సంబందిత అధికారులు, స్థానిక శాసనసభ్యులు, ప్రజాప్రతినిధుల సమన్వయంతో సమీక్షలు నిర్వహించారు. ఇప్పటికే మచిలీపట్నం, గుడివాడ, అవనిగడ్డ, కైకలూరు, పెడన, మైలవరం, జగ్గయ్యపేట నియోజకవర్గాల్లో సమీక్షలు నిర్వహించారు. గృనిర్మాణాల పురోగతి పై చేపట్టాల్సిన అంశాలకు సంబందించి ప్రతి రోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులకు ఆదేశిస్తున్నారు. గృహ నిర్మాణ పథకం క్రింద స్టేజిలవారీగా చెల్లింపుకు షెడ్యూలను సవరించడం జరిగింది. ఇంటి నిర్మాణానికి రూ. 1.80 లక్షల యూనిట్ ధర చెల్లింపు షెడ్యూల్ లో సవరణలు చేశారు. ఆప్షన్ – 1,2 కింద ఇళ్లు నిర్మించుకోనే లబ్దిదారులు బేస్మెంట్ లెవల్ పూర్తి చేస్తే వెంటనే రూ. 60 వేలు రూపాయలు, ప్రభుత్వం వారి బ్యాంకు ఖాతాలకే చెల్లిస్తుంది. రూఫ్ లెవల్ స్థాయికి రూ. 60 వేలు , రూఫ్ కాస్ట్కు రూ.30 వేలు, ఫినిషింగ్ పనులు పూర్తి అయిన పిమ్మట మరో రూ.30 వేల రూపాయలు చెల్లించడం జరుగుతుంది. ఆప్షన్ – 3 కింద లబ్దిదారులు ఇళ్ల నిర్మాణంలో బేస్ మెంట్ లెవల్ పూర్తి చేసిన వెంటనే రూ. 60 వేలు, రూఫ్ లెవల్ స్థాయిలో రూ. 60 వేలు, రూఫ్ కాస్ట్ ఫినిషింగ్ పనులు పూర్తి అయిన పిమ్మట రూ. 60 వేలు చొప్పు న అందించడం జరుగుతుంది. జిల్లాలో ఆప్షన్ -3 కింద గృహాలు నిర్మించే లబ్దిదారులు గ్రూపులుగా ఏర్పడి గృహ నిర్మాణం కొరకు మెటీరీయల్ కొనుగోలులో పెద్ద మొత్తంలో కొనుగోలు చేయడం వలన సిమ్మెంట్ రూ. 15 వేలు, ఐరన్ రూ. 10వేలు ఇతర మెటీరియల్ కు రూ.10 వేలు చొప్పన ఆదాఅవుతుంది. ఇందుకు ఆయా పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో కార్పోరేటర్లు, గ్రామ సర్పంచ్ ల సమన్వయతో అధికారులు లబ్దిదారులు గృహ నిర్మాణాలు వేగవంతంగా చేపట్టేందుకు అవగాహన కల్పిస్తున్నారు. క్షేత్రస్థాయిలో 50 కుటుంబాలపై వాలెంటీర్లకు అవగాహన ఉంటుంది, లబ్దిదారులు ఇచ్చిన స్థలంలో వేగంవతంగా ఇల్లు ఎవరెవలు నిర్మిస్తారనే బాద్యతను వాలెంటీర్లకు అప్పగించడం జరిగింది. గతంలో లబ్దిదారులకు ఇల్ల స్థల పట్టాలు ఇచ్చినప్పటికీ వారి స్థలాలు ఎక్కడున్నాయో తెలియని పరిస్థితి ఉండేది. నేడు జగనన్న కాలనీల్లో లేఅవుట్లలో విద్యుత్, వాటర్, డ్రైన్, అంతర్గత రహదారులు వంటి మౌలిక సదుపాయాలను కల్పించి లబ్దిదారులకు గృహాను ప్రభుత్వం నిర్మిస్తుంది. జిల్లాలో 1.67 లక్షలు మంది ఇల్లు నిర్మించాల్సి ఉంది. ఇంటి నిర్మాణంలో ప్రభుత్వం అందించే ఆర్థిక సహాయానికి తోడుగా వీరిలో ఇప్పటి వరకు 22 వేల మందికి రూ. 55 వేలు చొప్పున బ్యాంకు రుణ సౌకర్యాన్ని కల్పించడం జరిగింది. గృహనిర్మాణాపు పేమెంట్లు గతంలో 5 దశల్లో ఉండేవని, నేడు 3 దశల్లోనే పేమెంట్లు చెల్లించడం జరుగుతుంది. ప్రతి ఏడాది నిర్మాపు వ్యయం పెరుగుతున్నందున తొందరగా ఇల్లు నిర్మించుకున్న వారికి పనులు అయిన వెంటనే పేమెంట్లను ప్రభుత్వం చెల్లిస్తుంది. ఇళ్ల బేస్ మెంట్ కు 365 కిలోల ఐరన్, 40 బస్తాల సిమ్మెంట్ అందించడం జరుగుతుంది. వాలెంటీర్లు, ఇంజినీరింగ్ అసిసెట్లు లబ్దిదారుల్లో గృహనిర్మాణం త్వరత గతిన ఇల్లు నిర్మించే విదంగా అవగాహన కల్పించడంలో చర్యలు చేపట్టారు. జిల్లాలో ఇప్పటికే గృనిర్మాణ సంస్థ ద్వారా 16 నియోజక వర్గాలకు సంబందించి 10091.1 మెట్రిక టన్నుల సిమ్మెంట్, 21.64.68 మెట్రిక్ టన్నుల ఐరన్ సిద్దం చేయగా దగ్గరలోని ర్యాంపుల నుంచి ఉచిత ఇసుకను సరఫరా చేస్తుంది. కృష్ణా జిల్లాలో 1,247 జగనన్న కాలనీల లో అవుట్ల ఉండగా ఇందులో 1,89,446 ఇళ్లు మంజూరు చేశారు. వాటిలో ఇప్పటకే 1,03880 ఇళ్లకు శంకుస్థాపన చేయగా వీటిలో 96,496 ఇళ్లు పునాది దశలోను, మరో 3,296 ఇళ్లు బెస్ మెంట్ దశను పూర్తి చేసుకున్నాయి. గతంలో ఏప్రభుత్వం చేయని రీతిలో నేడు రాష్ట్ర ప్రభుత్వం జగనన్న ఇళ్ల కాలనీల్లో సీసీ రోడ్లు, మంచినీటి సదుపాయం, డ్రైనేజీ, విద్యుద్దీకరణ, అండర్ గ్రౌండ్ ఇంటర్నెట్ వంటి వసతులను సమరకూర్చుతుంది.

Check Also

దాడి పూర్ణిమను ఆశీర్వదించిన ఎమ్మెల్యే సుజనా చౌదరి

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్ దాడి అప్పారావు మనవరాలు, తెలుగు యువత నాయకులు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *