Breaking News

పెడనలో కౌంటింగ్ కేంద్రాన్ని సందర్శించి కౌంటింగ్ ఏర్పాట్లు పరిశీలించిన ఆర్డివో…

పెడన, నేటి పత్రిక ప్రజావార్త :
ఈ నెల 19వ తేది ఆదివారం జడ్ పిటిసి, ఎంపిటిసి ఎన్నికల ఓట్ల లెక్కింపు పురస్కరించుకుని బందరు ఆర్ డివో ఎస్ఎస్ కె. ఖాజావలి పెడన కప్పలదొడ్డి రోడ్డులో బొడ్డు నాగయ్య గవర్నమెంటు జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రాన్ని తనిఖీ చేసి కౌంటింగ్ ఏర్పాట్లు పరిశీలించారు. బ్యారీ కెడింగ్ ఏర్పాట్లు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆర్ డివో మాట్లాడుతూ పెడన నియోజక వర్గ పరిధిలో గల గూడూరు, బంటుమిల్లి, కృత్తివెన్ను మండలాల జడ్ పిటిసి , ఎంపిటిసి స్థానాలకు జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపు ఈ నెల 19వ తేది ఉదయం 8 గంటలకు ప్రారంభమవుతుందని అన్నారు. పెడన మండల జడ్ పిటిసి స్థానానికి ఎన్నిక జరగలేదని తెలిపారు. ఆయా మండలాల్లో పోలైన ఓట్ల సంఖ్య, సెగ్మెంట్ల సంఖ్యను బట్టి కౌంటింగ్ టేబుల్స్ ఏర్పాటు చేస్తున్నట్లు ఆర్ డివో తెలిపారు. కౌంటింగ్ ప్రక్రియ పకడ్బందిగా సజావుగా జరగడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అవసరమైన కౌంటింగ్ అధికారులు, సిబ్బందిని నియమించినట్లు తెలిపారు. ఆదివారం మధ్యాహ్నం నుండి ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉందని తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలీసుశాఖ ద్వాపా పటిష్ట వంతమైన బందోబస్తు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. కౌంటింగ్ ఎజెంట్లు, ప్రజాప్రతినిధులు కౌంటింగ్ సజావుగా జరగడానికి సహకరించాలని కోరారు.
బందరు డిఎస్ పి మాసుం భాషా, పెడన తహసిల్దారు, ఎంపిడివో తదితరులు ఆర్డీవో వెంట ఉన్నారు.

Check Also

త్వరలోనే విశాఖపట్టణం, తిరుపతిలలో పర్యాటక పెట్టుబడిదారుల సదస్సు

-సచివాలయంలో పర్యాటక శాఖ ఉన్నతాధికారులతో జరిగిన సమీక్షా సమావేశంలో రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *