Breaking News

బీసీలకు, జోగిరమేష్ కు చంద్రబాబు బేషరతుగా క్షమాపణ చెప్పాలి… : ఎమ్మెల్యే మల్లాది విష్ణు

-కుట్రలు, నీచ రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ తెలుగుదేశం పార్టీ…
-చంద్రబాబు డైరక్షన్ లోనే జోగి రమేష్ పై దాడి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి పై అయ్యన్నపాత్రుడు చేసిన అనుచిత వ్యాఖ్యల‌ను, ఎమ్మెల్యే జోగీ రమేష్ పై టీడీపీ నాయకుల దాడిని వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్యే మ‌ల్లాది విష్ణు  తీవ్రంగా ఖండించారు. చంద్రబాబు, టిడిపి నేతలు రాష్ట్రంలో రౌడీలా ప్రవర్తిస్తున్నారని ఆయ‌న మండిప‌డ్డారు. చంద్రబాబు ఇంటి వ‌ద్ద శాంతియుతంగా నిర‌స‌న వ్యక్తం చేస్తున్న‌ వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ పై దాడి చేయడం చాలా బాధాకర‌మ‌న్నారు. ప్రజలచే ఎన్నుకోబడిన జోగి రమేష్ పై జరిగిన దాడిని బడుగు, బలహీన వర్గాలపై జరిగిన దాడిగా ఆయన పేర్కొన్నారు. బీసీలంటే చంద్రబాబుకు గిట్టదని.. అనేక సందర్భాలలో వారి పట్ల చులకనభావంతో వ్యవహరించారని మల్లాది విష్ణు అన్నారు. బీసీ సోదరులు తమ సమస్యలను పరిష్కరించాలని వస్తే తోకలు కత్తిరిస్తానని హేళనగా మాట్లాడి చంద్రబాబు అవమానించారని గుర్తుచేశారు. బడుగు బలహీన వర్గాల నాయకుడైన జోగి రమేష్ పై దాడికి కూడా అసలు కుట్రదారుడు చంద్రబాబేనని మల్లాది విష్ణు  వ్యాఖ్యానించారు. చంద్రబాబు ఆదేశాలతోనే జోగి రమేష్ పైనా తెలుగుదేశం నాయకులు దాడులకు తెగబడ్డారన్నారు. రాళ్లు, కర్రలతో దాడులకు తెగబడటం చూస్తుంటే.. ముందుస్తుగానే అల్లర్లు సృష్టించేందుకు సిద్ధపడినట్లు అర్థమవుతోందన్నారు. ఇటువంటి చర్యలు చంద్రబాబుకి కొత్తేమీ కాదని మల్లాది విష్ణు అన్నారు. ప్రశ్నించే నాయకులపై చెప్పులు వేయించడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అన్నారు. ప్రజలలో జగన్మోహన్ రెడ్డికి పెరుగుతున్న ఆదరణ చూసి ఓర్వలేకనే.. తెలుగుదేశం నేతలను రెచ్చగొడుతూ ముఖ్యమంత్రివర్యులను చంద్రబాబు అసభ్య పదజాలంతో తిట్టిస్తున్నారని మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీని బ్రతికించుకునేందుకు చంద్రబాబు దిగజారి ప్రవర్తిస్తున్నారన్నారు. రాష్ట్రంలో ప్రధానమైన ప్రతిపక్షంగా తెలుగుదేశం పార్టీ పూర్తిగా విఫలమైందన్నారు. చివరకు చంద్రబాబు నివాసం.. ప్రజా ప్రభుత్వంపైన కుట్రలు చేసే వేదికగా తయారైందన్నారు. దేవినేని ఉమా, బుద్దావెంకన్న వంటి నేతలు అక్కడికి చేరి వైఎస్సార్ సీపీ నాయకులు, శ్రేణులపై భౌతిక దాడులకు, వ్యక్తిగత దూషణలకు కుట్రలు పన్నుతున్నారన్నారు. దేశ వ్యాప్తంగా మన రాష్ట్రానికి కీర్తిప్రతిష్టలు తెచ్చి పెడుతున్న పోలీస్ వ్యవస్థపైనా దిగజారుడు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. తక్షణమే చంద్రబాబు, అయ్యన్నపాత్రుడు, బుద్ధా వెంకన్న రాష్ట్ర ప్రజానీకానికి, బీసీ సోదరులకు క్షమాపణ చెప్పాల‌ని మ‌ల్లాది విష్ణు డిమాండు చేశారు.

Check Also

త్వరలోనే విశాఖపట్టణం, తిరుపతిలలో పర్యాటక పెట్టుబడిదారుల సదస్సు

-సచివాలయంలో పర్యాటక శాఖ ఉన్నతాధికారులతో జరిగిన సమీక్షా సమావేశంలో రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *