Breaking News

జనసేన నాయకుడు బత్తిన మధుబాబు జన్మదిన వేడుకల్లో సేవా స్ఫూర్తి ప్రతిధ్వనించింది…

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
తిరుపతిలో జనసేన పార్టీ ఉమ్మడి చిత్తూరు జిల్లా ఉపాధ్యక్షులు బత్తిన మధుబాబు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తిరుపతి శాసనసభ్యులు ఆరాణి శ్రీనివాసులు, ఆంధ్రప్రదేశ్ హస్తకళా నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్ డా. పసుపులేటి హరిప్రసాద్, నవీన్ కుమార్ రెడ్డి హాజరయ్యారు.

ఈ సందర్భంగా మాట్లాడిన ఆంధ్రప్రదేశ్ హస్తకళా నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్ డా. పసుపులేటి హరిప్రసాద్, మధుబాబు సేవా తత్పరతను ప్రశంసించారు. మధుబాబుతో తానున్న చిన్ననాటి స్నేహాన్ని, ప్రజారాజ్యం పార్టీ నుండి ఇప్పటి వరకు సాగుతున్న రాజకీయ ప్రయాణాన్ని గుర్తుచేసుకున్నారు. మధుబాబు చిత్తూరు జిల్లా ఉపాధ్యక్షుడిగా ఉన్నందుకు ఆనందం వ్యక్తం చేస్తూ, చిరంజీవి “ప్రేమే లక్ష్యం, సేవే మార్గం” అనే సిద్ధాంతాన్ని, పవన్ కళ్యాణ్ “ఇవ్వడం నేర్చుకున్నవాడే నిజమైన నాయకుడు” అనే సందేశాన్ని స్మరించారు. మధుబాబు గతంలో గ్యాస్ సిలిండర్ల పంపిణీ, తుఫాను సహాయ కార్యక్రమాలు, వరద బాధితులకు సహాయం వంటి అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారని తెలిపారు. ఈ పుట్టినరోజు వేడుకలో కూడా స్కవెంజర్ కాలనీ ప్రజలకు భోజనాలు, దుప్పట్ల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేసిన మధుబాబు సేవాగుణాన్ని అభినందించారు. “సేవ చేయాలనే మనసు ఉంటే డబ్బు అవసరం లేదు” అని ఆయన పేర్కొన్నారు. మధుబాబు పుట్టినరోజును కేవలం వేడుకగా కాకుండా పదిమందికి సహాయం చేసే వేదికగా మార్చాలని ఆయన ఆకాంక్షించారు. ప్రజలకు సేవ చేయడం, నిస్వార్థంగా ఇవ్వడం అనే భావనను ప్రతి జనసేన కార్యకర్తలో మధుబాబు నింపుతున్నారని చెప్పారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆరాణి శ్రీనివాసులు, నవీన్ కుమార్ రెడ్డి, వెంకటేశ్వర్లు, క్రికెట్ విజయ్, అనేకమంది జనసేన నాయకులు, మహిళలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

పెనుగంచిప్రోలులో మజ్జిగ పంపిణీ కార్యక్రమం

పెనుగంచిప్రోలు, నేటి పత్రిక ప్రజావార్త : పెనుగంచిప్రోలు మండలంలో కృష్ణా జిల్లా సహకార కేంద్ర బ్యాంకు లిమిటెడ్, పెనుగంచిప్రోలు బ్రాంచ్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *