Breaking News

పార్కులను అభివృద్ధి చేసి, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ప్రజలకు అందించండి…

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పార్కులను అభివృద్ధి చేసి, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ప్రజలకు అందించాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. మంగళవారం ఉదయం తన పర్యటనలో భాగంగా రాఘవయ్య పార్కు, అప్సర థియేటర్ రోడ్డు, కూర్మయ్య వంతెన రోడ్డు, ప్రాంతాలన్నీ పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ రాఘవయ్య పార్కులోని కేబుల్ బ్రిడ్జ్ లో ఉన్న మరమ్మతులు పూర్తి చెయ్యాలని, పార్కు కు వచ్చే ప్రజలకు ఆరోగ్యకరమైన వాతావరణం అందించెందుకు హరిత ని మరింత పెంచాలని, పిల్లలకు ఆట పరికరాలను పార్క్ లో అమర్చాలని అధికారులను ఆదేశించారు. అప్సర థియేటర్ వద్ద గల యూరినల్స్ ను పరిశీలించి, నగరంలో ఉన్న యూరినల్స్ అన్నీ పరిశుభ్రంగా ఉంచాలని అన్నారు. విజయ టాకీస్ వద్ద గల కూర్మయ్య వంతెన ను పరిశీలించి, వంతెన నిర్మించి చాలా సంవత్సరాలు అయి ఉండడంతో వాటిపైన ప్రజల రాకపోకలను నిషేదిస్తూ, హెచ్చరిక బోర్డు ను అమర్చాలని అధికారులను ఆదేశించారు.

ఈ పర్యటనలో చీఫ్ సిటీ ప్లానర్ కె. సంజయ్ రత్న కుమార్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (పార్క్స్) ప్రభాకర్, డిప్యూటీ డైరెక్టర్ హార్టికల్చర్ చంద్రశేఖర్, అసిస్టెంట్ సిటీ ప్లానర్ రాంబాబు, సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

నాబార్డు క్రెడిట్ ప్లాన్ ఆవిష్కరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు

-2026-27 సంవత్సరానికి రూ.5.11 లక్షల కోట్ల రుణ ప్రణాళిక అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : నాబార్డు క్రెడిట్ ప్లాన్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *