Breaking News

భారత్ బంద్ నకు మద్దతుగా సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ నిరసన ప్రదర్శనలు…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆల్ ఇండియా రైల్వే మెన్ ఫెడరేషన్ మరియు సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ ఇచ్చిన పిలుపు మేరకు ఈ రోజు సెప్టెంబర్ 27 న రైతులపై పెను భారాన్ని మోపుతున్న వ్యవసాయ చట్టాలను రద్దు కోరుతూ జరుపుతున్న దేశ వ్యాప్త సమ్మె కు మద్దతుగా సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ విజయవాడ డివిజన్ ఆధ్వర్యములో విజయవాడ రైల్వే స్టేషన్ ముందు బ్రహ్మాండమైన నిరసన ప్రదర్శన నిర్వహించటం జరిగింది. సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ విజయవాడ డివిజనల్ సెక్రటరీ కామ్రేడ్ జి ఎన్ శ్రీనివాస రావు గారు మాట్లాడుతూ దేశ రాజధాని లో గత పది నెలలుగా అన్ని రైతు సంఘాలు కలిసి పోరాడుతున్నా కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరితో రైతులతో చర్చలకు రాకుండా ఏకపక్షంగా వ్యవసాయ చట్టాలను మార్చి రైతులపై రుద్దటం అన్యాయమని పేర్కొన్నారు. ఈ చట్టాలు కేవలం బడా పెట్టుబడిదారులకు మాత్రమే లాభాలను చేకూరుస్తాయని రైతులకు ఎటువంటి ప్రయోజనం కలగదని వివరించారు. రైతుల పోరాటానికి రైల్వే కార్మికులందరూ మద్దతు ఇస్తారని, వ్యవసాయ చట్టాలు రద్దు చేసే వరకు సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ అన్ని ప్రజా సంఘాలతో కలిపి పోరాడుతుందని ఈ సందర్భముగా శ్రీనివాస రావు గారు హెచ్చరించారు. అలాగే మోనిటైజషన్ పేరుతొ ప్రభుత్వ రంగ ఆస్తులను ప్రయివేట్ సంస్థలకు, వ్యక్తులకు నామ మాత్రపు ధరలకు 99 సంవత్సరాల పాటు అప్ప చెప్పే ప్రయత్నాన్ని కేంద్ర ప్రభుత్వం విరమించుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కీలకమైన కోవిద్ పోరాటంలో ముందుండి ప్రజలకు సేవ చేసింది కేవలం ప్రభుత్వ రంగ సంస్థలలోని కార్మికులే నని వివరించారు. అలాగే రాష్ట్ర CITU నాయకులు ఉమా మహేశ్వర రావు గారు మాట్లాడుతూ వ్యవసాయ చట్టాల రద్దుకై పోరాడుతున్న రైతులకు మద్దతుగా రైల్వే కార్మికులు ముందుకు రావటం హర్షణీయమని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే దిగివచ్చి రైతులతో చర్చలు జరిపి వ్యవసాయ చట్టాలను రద్దు ;చేయాలనీ అలాగే మోనిటైజషన్ పేరుతొ ప్రభుత్వ రంగ ఆస్తులను లీజు కు ఇచ్చే ప్రయత్నాలను విరమించాలని డిమాండ్ చేసారు . CITU నాయకులు నరసింహులు గారు మాట్లాడుతూ వ్యవసాయ చట్టాల రద్దుకై అన్ని ప్రజా సంఘాలు మరియు కార్మిక సంఘాలు కలిసి పోరాడాలని పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమములో సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ జోనల్ వైస్ ప్రెసిడెంట్ శ్రీమతి లీలగారు, డివిజనల్ కోశాధికారిణి శ్రీమతి లక్ష్మి గారు, సహాయ డివిజనల్ కార్యదర్సులు శ్రీనివాస్, రామ గుప్త, సాయి కుమార్ గార్లు, లోకల్ బ్రాంచ్ కార్యదర్సులు, పెద్ద సంఖ్యలో రైల్వే కార్మికులు పాల్గొన్నారు. అలాగే ఈ సందర్భముగా ఈ కార్యక్రమానికి మద్దతుగా వచ్చిన అల్ ఇండియా రైల్వే లోకో అసోసియేషన్ నాయకులకు, సీఐటీయూ నాయకులకు అన్ని ప్రజా సంఘాల నాయకులకు, హింద్ మజ్దూర్ సభ నాయకులకు కామ్రేడ్ శ్రీనివాస రావు గారు ధన్యవాదములు తెలియ చేసారు. అలాగే విజయవాడ డివిజన్ వ్యాప్తముగా అన్ని డిపోల ముందు రైతు చట్టాల రద్దు కొరకు దేశ వ్యాప్త సమ్మెకు మద్దతుగా ప్రదర్శనలు జరిపిన అన్ని బ్రాంచ్ నాయకులకు, కార్యకర్తలకు ధన్యవాదములు తెలియచేసారు. ప్రజా వ్యతిరేక మరియు కార్మిక వ్యతిరేఖ చట్టాల రద్దు కొరకు జరిపే ప్రతి పోరాటానికి సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ మద్దతు ఇస్తుందని ఈ సందర్భముగా సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ డివిజనల్ కార్యదర్శి కామ్రేడ్ జి ఎన్ శ్రీనివాస రావు హామీ ఇచ్చారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

డిల్లీలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి పర్యటన

-రవాణా వ్యవస్థపై క్షేత్ర స్థాయిలో సమీక్షా -రోడ్డు భద్రతా విధి విధానాలపై మంత్రి పరిశీలన -తెలంగాణ రవాణా శాఖ మంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *