-నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి అధికారులతో కలసి చిట్టినగర్ సొరంగం కొండ ప్రాంతాల్లో గత రాత్రి నుండి కురుస్తున్న వర్షం కారణంగా కొండ రాళ్లు జారి పడిన ప్రదేశాన్ని పరిశీలించారు. కొండపై నివశించు ప్రజలు అప్రమత్తంగా ఉంటూ అధికారులతో సహకరించాలని సూచించారు. ముందు జాగ్రత్త చర్యలు కొండ అంచున ఉన్న వారిని అక్కడ నుండి తరలించుట చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. స్వాతి రోడ్, భవానిపురం, ఎస్.టి.పి పార్క్ మరియు రోటరీ నగర్ తదితర ప్రాంతాల్లో వర్షపు నీట మునిగిన రోడ్లను పరిశీలించారు. రోడ్ల పై నిలిచిన వర్షపు నీటిని సైడ్ డ్రెయిన్ లేదా మేజర్ అవుట్ ఫాల్ డ్రెయిన్ లకు మళ్ళించు నట్లుగా చూడాలని అవసరమైనచో మోటార్ల ద్వారా నిల్చిన నీటిని తోడించాలని అధికారులకు సూచించారు. పర్యటనలో 42వ డివిజన్ కార్పొరేటర్ పి.చైతన్య రెడ్డి, చీఫ్ ఇంజనీర్ యం.ప్రభాకరరావు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కె.నారాయణమూర్తి మరియు ఇతర అధికారులు సిబ్బంది, స్థానికులు పాల్గొన్నారు.