నూజివీడు, నేటి పత్రిక ప్రజావార్త :
స్పందన దరఖాస్తుల పరిష్కారంలో అలసత్వం వద్దని, నిర్ణీత సమయంలోనే తప్పనిసరిగా పరిష్కరించాలని రెవిన్యూ డివిజనల్ అధికారి కె.రాజ్యలక్ష్మి అధికారులను ఆదేశించారు. స్ధానిక సబ్ కలెక్టరు కార్యాలయంలో సోమవారం స్పంధన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆర్డీఓ రాజ్యలక్ష్మి మాట్లాడుతూ స్పందన అర్జీదారులను పలుమార్లు కార్యాలయాల చుట్టూ త్రిప్పుకోకుండా ధరఖాస్తుల పరిష్కారానికి వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. స్పంధన కార్యక్రమంలో అందిన అర్జీలను నిర్ణీత సమయంలోగా పరిష్కరించాలని, అనర్హత కలిగిన దరఖాస్తు దారుల విషయంలో అనర్హతకు సంబంధించిన అంశాన్ని సవివరంగా తెలియజేస్తూ తిప్పి పంపాలి తప్ప, దరఖాస్తును రోజుల తరబడి పెండింగ్ లో ఉంచొద్దన్నారు . ఏవైనా మీ పరిధిలో పరిష్కారం కానీ సమస్యలు ఉంటే వెంటనే సంబంధిత శాఖలకు పంపాలన్నారు. ప్రజలు తమ సమస్యల పరిష్కారానికి అర్జీ తీసుకువస్తే తక్షణమే వాటి పరిష్కారానికి కృషి చేయాలన్నారు. అధికారులు స్పందన అర్జీలను పెండింగ్ లేకుండా చూచుకోవాలని ఎప్పటికప్పుడు స్పందన అర్జీలు ఎన్ని పరిష్కరించారు, ఎన్ని పెండింగ్ లో ఉన్నాయి తనకు నివేదిక పంపాలని అధికారులకు సూచించారు. స్పందన కార్యక్రమంలో డివిజనల్ పరిపాలనాధికారి యం. హరనాధ్, వైద్య ఆరోగ్య శాఖాధి కారి డా. పి. అనూష, మున్సిపల్ కార్యాలయ ప్రతినిధి బి.వి.ఎస్. సూర్యనారాయణ, ఉద్యానశాఖ అధికారిణి యం. రత్నమాల, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
Tags nuzividu
Check Also
డిల్లీలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి పర్యటన
-రవాణా వ్యవస్థపై క్షేత్ర స్థాయిలో సమీక్షా -రోడ్డు భద్రతా విధి విధానాలపై మంత్రి పరిశీలన -తెలంగాణ రవాణా శాఖ మంత్రి …