-ఎర్రకాలువ లో వరదనీటి ఉధృతి ని పరిశీలించాం..
-ఇంఛార్జి ఆర్డీవో/ జేసి (ఆసరా) పి.పద్మావతి
నిడదవోలు, నేటి పత్రిక ప్రజావార్త :
గతంలో ఎర్రకాలువ వరద నీటి ఉధృతి వల్ల ఎనిమిది గ్రామాలు ముంపుకు గురి అయ్యాయని, ఆ అనుభవాల దృష్ట్యా ప్రస్తుత పరిస్థితిని స్థానిక శాసన జి. శ్రీనివాస్ నాయుడు తో కలసి క్షేత్రస్థాయిలో పరిశీలించడం జరిగిందని కొవ్వూరు ఇంఛార్జి ఆర్డీవో/ జేసి (ఆసరా) పి.పద్మావతి తెలిపారు. సోమవారం నిడదవోలు మండలం కంసాలిపాలెం గ్రామంలో ఎర్రకాలువ వరద నీటి ఉధృతి ని పరిశీలించారు. ఈ సందర్భంగా పి. పద్మావతి మాట్లాడుతూ,ఎర్ర కాలువ నీటి ప్రవాహాన్ని పరిశీలన చేసేందుకు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికల నేపథ్యంలో, కలెక్టర్ సూచనలు మేరకు క్షేత్రస్థాయిలో పర్యటించడం జరిగిందని జాయింట్ కలెక్టర్ (ఆసరా), కొవ్వూరు ఇంఛార్జి ఆర్డీవో పి. పద్మావతి తెలిపారు. నిడదవోలు మండలం లో గతంలో ముంపునకు గురి అయిన ప్రాంతాల్లో పర్యటించి వాస్తవ పరిస్థితులను పరిశీలించామన్నారు. ప్రస్తుతం ఎర్ర కాలువ ప్రమాద స్థాయిలో లేదని , ఇప్పటికే క్షేత్రస్థాయిలో గత అనుభవాల దృష్ట్యా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామన్నారు. ఈ పర్యటన లో క్షేత్రస్థాయి అధికారులకు తగిన సూచనలు చేశామన్నారు. క్షేత్రస్థాయి పర్యటనలో స్థానిక శాసనసభ్యులు జి. శ్రీనివాస్ నాయుడు, తహసీల్దార్ ఎమ్. గంగరాజు, ఇతర జి. శ్రీనివాసులు నాయుడు, స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.